– రాష్ట్ర భవిష్యత్తును ఓటు అనే ఆయుధంతో నిలబెట్టాలి
– పుంగనూరు పర్యటనలో భువనమ్మ వ్యాఖ్య
రానున్న ఎన్నికల కురుక్షేత్రానికి వైసీపీ సిద్ధం అంటే…టీడీపీ కార్యకర్తలు సై అంటూ ముందుకు దూకాలని పుంగనూరు పార్టీ శ్రేణులకు చంద్రబాబు సతీమణి భువనమ్మ సూచించారు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ కార్యకర్తలను వేధింపులు, ఇబ్బందులకు గురిచేసిన దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు కార్యకర్తలు కంకణబద్దులు కావాలని కోరారు.
పుంగనూరు నియోజకవర్గం, పుంగనూరు మండలం, ఒంటిమిట్ట గ్రామంలో పార్టీ కార్యకర్త సొరకాయల శ్రీనివాసులు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం గ్రామస్తులు, పార్టీ శ్రేణులతో భువనమ్మ మాట్లాడుతూ… జగన్ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది.. రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు లేక ప్రక్క రాష్ట్రాలకు వలసపోవాల్సిన దుస్థితి వచ్చింది.
జగన్ ప్రజావ్యతిరేక పాలనను ప్రశ్నిస్తున్నారనే కక్షతో చంద్రబాబుగారిపై అక్రమ కేసు పెట్టి 53రోజులు జైల్లో నిర్బంధించారు.పుంగనూరులో చంద్రబాబుకు సంఘీభావంగా సైకిల్ ర్యాలీ చేసే టీడీపీ కార్యకర్తలను వైసీపీ దుర్మార్గులు ఏ విధంగా వేధించాలో, దాడి చేశారో రాష్ట్రమంతా చూసింది. గతంలో నందం సుబ్బయ్య వైసీపీకి జై కొట్టలేదని నడిరోడ్డమీద గొంతు కోసి చంపేశారు..నందం సుబ్బయ్య పార్టీకోసం ప్రాణాలిచ్చిన కార్యకర్త. ఆయన త్యాగానికి నా జోహార్లు.
రాష్ట్ర ప్రజలంతా ఓటు అనే ఆయుధంతో భవిష్యత్తును నిలబెట్టుకునేందుకు సై అంటూ ముందుకు రావాలి. ఓటు వేసే ముందు మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే నాయకులు ఎవరో ఆలోచించి ఓటు వేయాలి.. చంద్రబాబు పాలనతోనే ఏపీకి భవిష్యత్తు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుందాం…భావితరాల భవిష్యత్తును కాపాడుకుందాం.