సొంత మండలం పొదలకూరు నుంచి భారీగా టీడీపీలోకి వలసలు
నెల్లూరు, మహానాడు: సర్వేపల్లి వైసీపీ అభ్యర్థి, మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి సొంత మండలం పొదలకూరులో వైసీపీ శ్రేణుల నుంచే ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గత కొన్నిరోజులుగా టీడీపీలోకి వలసలు భారీగా జరగడంతో మండల వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. జగన్ ప్రభుత్వంలో తమకు ఒరిగింది ఏమీ లేదని, ఆయన వైపు ఉంటే తాము నష్టపోవాల్సి వస్తుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలు పార్టీ మారుతున్నారు. పొదలకూరు టౌన్ శ్రీహరి కాలనీకి చెందిన 12 కుటుంబాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు శనివారం నెల్లూరు వేదాయపాలెంలోని సోమిరెడ్డి కార్యాలయంలో ఆయన సమక్షంలో టీడీపీలో చేరారు. చిన్న హజరత్, పెంచలయ్య, నాగేంద్ర, షఫీ, మానేటి వెంకటాద్రి, షేక్ షాజహాన్, షేక్ దొరబాబు, గొలగమూడి హరికృష్ణ, హుస్సేన్ బాషా, ఊడా విజయ్ పాల్గొన్నారు.