మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలి
టీడీపీ నూతన ఇంఛార్జి గోరంట్ల రవి కుమార్ కు అభినందనలు
దర్శి జనసేన నాయకులు గరికపాటి వెంకట్
దర్శి : వైసీపీ ఆదివారం మేదరమెట్లలో నిర్వహించిన ‘సిద్ధం’ సభ ఫ్లాప్ షో గా మారిందని దర్శి జన సేన నాయకులు గరికపాటి వెంకట్ విమర్శించారు. అధికారంలో ఉన్న సమయంలో ఏం చేశారో ప్రజలకు చెప్పకుండా ప్రతిపక్ష పార్టీలను విమర్శించేందుకే సభను పెట్టినట్లుగా ఉందని ఆరోపించారు. సభకు హాజరై ఇంటికి వెళుతున్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన ఒంగోలు బలరాం కాలనీకి చెందిన మురళీ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరో సంఘటనలో బస్సులో నుంచి జారిపడి మృతి చెందిన పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన గేదెల బాలదుర్గ కుటుంబానికి కూడా ఆర్ధిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
సభను విజయవంతం చేయాలి
ఈనెల 17న టీడీపీ, జన సేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో జరగనున్న సభను విజయవంతం చేయాలని కోరారు. దర్శి టీడీపీ నూతన ఇంఛార్జిగా నియమితులైన గోరంట్ల రవి కుమార్ కు అభినందనలు తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయానికి సమిష్టిగా కృషి చేయాలని కోరారు.