– చంద్రబాబు-పవన్‌పై బూతులతో కామెంట్లు
– మార్ఫింగ్ ఫొటోలతో అనైతిక చర్యలు
– గతంలోనే ఇంటూరిపై ఫిర్యాదులు
– మిగిలిన వైసీపీ పేటీఎం బ్యాచ్‌కు దేహశుద్ధి
– ఫొటో మార్ఫింగ్ బ్యాచ్‌కు పోలీసుల దబిడి దిబిడి
గుడివాడ: అత్యంత జుగుప్సాకరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు- ఉప ముఖ్యమంత్రి పవన్ ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న, వైసీపీ కార్యకర్త ఇంటూరి రవికిరణ్ పై గుడివాడ కు చెందిన అసిలేటి నిర్మల ఈ నెల 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును గుడివాడ 1 టౌన్ పోలీసులు, ఇంటూరి రవికిరణ్ ను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ఇంటూరి అరెస్ట్, వైకాపా గుడ్లవల్లి పుకార్ల ప్రచారం సమయం అనేది కాకతాళీయం.
ట్విట్టర్లో అమ్మాయిల ఫొటోలు మార్పింగ్ చేసి, స్పేస్‌లో మహిళలను బూతులు తిడుతూ కామెంట్లు పెడుతున్న వైసీపీ సోషల్‌మీడియా అల్లరి బ్యాచ్‌కు పోలీసులు దేహశుద్ధి చేశారు. శ్రీనాధ్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, హరిరెడ్డి, దిల్లీరెడ్డి, గంగిరెడ్డి, రాహుల్‌రెడ్డి, నాగార్జునరెడ్డి అనే యువకులు గత కొన్నేళ్ల నుంచి టీడీపీ, ఇతర మహిళా నేతలను లక్ష్యంగా చేసుకుని, ట్విట్టర్లో వారి ఫొటోలు మార్ఫింగ్ చేసి, వేధిస్తున్నారు. ప్రభుత్వం మారడంతో కథ అడ్డం తిరిగింది. పోలీసులు ఈ అరాచకశక్తులను గుర్తించి దేహశుద్ధి చేస్తుంటే, ఇకపై అలాంటి పనులు చేయమంటూ కాళ్లమీద పడుతున్న వీడియో ఇది. సోషల్‌మీడియాలో ఈ వీడియో తెగ హల్చల్ చేస్తోంది.