రాజుపాలెం మండలంలో వైసీపీ ఖాళీ

కోట నెమలిపురి నుంచి టీడీపీలోకి చేరికలు

పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : రాజుపాలెం మండలంలో వైసీపీ నుంచి టీడీపీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. సోమవారం వెన్న వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఒకేసారి వైసీపీ నుంచి 50 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. ఎంపీటీసీ ఉడుముల అంజి రెడ్డి, మాజీ సర్పంచ్‌ దేవిరెడ్డి రమణారెడ్డి, మాజీ సర్పంచ్‌ తిరుమలపల్లి శ్రీరాములుతో పాటు 50 కుటుంబాలు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు. తాగునీటి సమస్య తీర్చలేని పాలకులు ఎందుకని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీతో అభివృద్ధి జరగదని భావించి టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు.