రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవంతో వైసీపీ భూస్థాపితం

జూన్‌ 4న ప్రజా తీర్పుతో, కూటమి విజయంతో స్పష్టం కాబోతోంది

-పిన్నెల్లి అహంకారాన్ని మాచర్ల ప్రజలు నిశ్శబ్ద విప్లవంతో అణిచివేశారు
-ఇది అర్థమయ్యే పోలింగ్‌ బూత్‌లో ఈవీఎం బాక్స్‌ను ధ్వంసం చేశాడు
-22 ఓట్లు టీడీపీకి, 6 ఓట్లు వైసీపీకి పడటంతో విధ్వంసానికి తెరలేపాడు
– సెన్సిటివ్‌ బూత్‌లలో కేంద్ర బలగాలు ఉంటే ఆయనను కాల్చేసేవారు
– రాష్ట్రంలోని మిగిలిన 174 నియోజకవర్గాల్లోనూ నిశ్శబ్ద విప్లవం వచ్చింది
-జగన్‌రెడ్డి అహంకార, అరాచక, నేరపూరిత ప్రభుత్వాన్ని కూలదోశారు
-వైసీపీకి ఏజెంట్లుగా కూర్చోవడానికి జనం దొరకక భయపడుతున్నారు
-ఇక లండన్‌లోనే జగన్‌ రెడ్డి మకాం.. పెద్ద భవనం కొన్నట్లు తెలిసింది
-తప్పుడు వాగుడు వాగుతున్న అంబటి, సజ్జల నోర్లు అదుపులో పెట్టుకోవాలి
-కొంతమంది అధికారులు జగన్‌ సేవలో తరించాలని తపన పడుతున్నారు
-తెలిసి తప్పు చేసిన ఎవరినీ కూడా వదిలేది లేదని బాబు ఆజ్ఞగా చెబుతున్నా
-అమరావతికి శంకుస్థాపన చేసిన చోటే ప్రమాణ స్వీకారం జరగాలని ఆకాంక్ష
-టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

మంగళగిరి, మహానాడు : రాష్ట్రంలో వచ్చిన నిశ్శబ్ద విప్లవం వైసీపీ అహంకార, అరాచక, హింసాత్మకమైన రాక్షస పాలనను పాతిపెట్టిందని జూన్‌ 4న ఇది స్పష్టం అవుతుందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడా రు. మాచర్లలో నిశ్శబ్ద విప్లవంతో పిన్నెల్లి అరాచకాన్ని ఆ నియోజకవర్గ ప్రజలు అణిచివేశారని తెలిపారు. దాన్ని జీర్ణించుకోలేకే పిన్నెల్లి విధ్వంసానికి తెరలేపి ఈవీఎం బాక్సులను పగలగొట్టాడని పేర్కొన్నారు. పిన్నెల్లి పగులగొట్టిన ఈవీఎం బాక్సు నుంచి పడిన స్లిప్పుల్లో 22 ఓట్లు టీడీపీకి, 6 ఓట్లు వైసీపీకి పడ్డాయి. అందుకే ఓటమి భయంతో పిన్నెల్లి విధ్వంసానికి తెరలేపాడని తెలిపారు.

కేంద్రబలగాలుంటే కాల్చేసేవారు

నిశబ్ధ విప్లవం రాష్ట్ర వ్యాప్తంగా జగన్‌ రెడ్డి నిర్మించుకున్న నేర సామ్రాజ్యాన్ని కూలదోసింది, భస్మీపటలం చేసింది, అణిచివేసింది. జగన్‌ రెడ్డి వికృత పరిపాల నకు స్వస్తి పలికింది. జగన్‌ రెడ్డి పాలనలో ఏ వర్గం సంతోషంగా లేరు. సెన్సిటి వ్‌ బూత్‌లలో ఎలక్షన్‌ కమిషన్‌ కేంద్ర బలగాలను నియమించినట్లు అయితే మాచర్లలో విధ్వంసం సృష్టించిన పిన్నెల్లిని కాల్చిపారేసేవారు. పిన్నెల్లి రెక్కలు విరిచి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లేవారు. సెన్సిటివ్‌ బూత్‌ అని తెలిసినా అక్కడ సెంట్రల్‌ ఫోర్స్‌ పెట్టలేదంటే అది ఎన్నికల కమిషన్‌ నిర్లక్ష్యమా? లేదా లోకల్‌ పోలీసు అధికారుల నిర్లక్ష్యమా? లేక పిన్నెల్లి ప్రోద్బలంతో నియమించలేదా? సెంట్రల్‌ ఫోర్స్‌ను ఎన్ని బూత్‌ల వద్ద పెట్టారో వారిని ఎలా ఉపయోగించారో మాచర్ల పోలీసులు చెప్పాలి.

స్పష్టమైన మెజార్టీతో గెలవబోతున్నాం

పిన్నెల్లి పవిత్రుడని, ఏ నేరం చేయని అమాయకుడని, జగన్‌ రెడ్డికి ఇష్టమైన వాడని, ఈవీఎం బాక్సులు బద్దలు కొట్టడని సజ్జల బుకాయిస్తున్నాడు. ఇంకా మీకు ఎందుకు ఈ మేకపోతు గాంభీర్యం. మాచర్లలో నిశ్శబ్ద విప్లవం జరిగింది. ఆ విప్లవమే పిన్నెల్లి అరాచకాలను పాతిపెట్టింది. వైసీపీకి ఏజెంట్లుగా కూర్చో వడానికి జనం దొరకడం లేదు. ఏజెంట్లుగా కూర్చోవాలంటేనే భయపడుతు న్నారు. స్పష్టమైన మెజార్టీతో టీడీపీ గెలవబోతుంది. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే కొంత మంది వైసీపీ నాయకులు పారిపోయారు. అండర్‌ గ్రౌండ్‌కు వెళ్లి దాక్కున్నారు. పోలీసులు కూడా మారిపో యారు. పోలీసులు చట్టాన్ని అనుసరిస్తున్నారు. బాక్సులు పగలగొడితే రీ పోలింగ్‌ అడగలేదని సజ్జల రామకృష్ణారెడ్డి అవగాహన లేకుండా పచ్చి అబద్దాలు ఆడుతున్నాడు. మాచర్లలో నాలుగు బూత్‌లు, సత్తెనపల్లిలో 6, దర్శిలో 5, ఒంగోలు 5, శ్రీకాళహస్తి 1, చిత్తూరు 1, మదనపల్లి 1, అనంతపురం అర్బన్‌ 7, పుట్టపర్తి 2 చోట్ల కలిపి మొత్తం 31 బూత్‌లలో రీపోలింగ్‌ అడిగితే సజ్జల రీ పోలింగ్‌ అడగలేదనడం సిగ్గుచేటు.

జగన్‌ ఇక్కడే ఉంటారని చెప్పగలరా?

ఎంతకాలం అబద్దాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తారు? ఇలాగే బుద్ధి లేకుం డా మాట్లాడుతారా? జగన్‌ రెడ్డి మకాం లండన్‌కు మారనుందా? లండన్‌లో పెద్ద భవనం కొన్నట్లు తెలిసింది. అదికూడా ఆయనే చెప్పాలి. ఇక్కడ ఓడిపోయి న తరువాత జగన్‌ రెడ్డి ఇక్కడ నుంచి ఎగిరిపోయి లండన్‌ ప్యాలెస్‌లో వాలిపో తారు. జగన్‌ రెడ్డి ఇక్కడే ఉంటారని చెప్పగలరా సజ్జల గారు? వైసీపీ నేతలకు ఏదైనా పని ఉంటే వారు లండన్‌ వెళ్లాలే కానీ, జగన్‌ రెడ్డి ఇక్కడికి రారు. వైసీపీ నేతలే చెప్పాలి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే మీ జగన్‌ ఇక్కడే ప్రతిపక్ష నేతగా ఉంటారా అనేది.

జగన్‌ రెడ్డి సేవ నుంచి బయటకు రావాలి

ఇంకా కొంతమంది అధికారులు జగన్‌ రెడ్డి సేవలో తరించాలని తపన పడుతు న్నారు. ఇకనైనా వారు బయటకు రావాలి. ఆ పాపపు కూపం నుంచి బయటప డాలి. తెలిసి తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలేది లేదని టీడీపీ అధినేత నా ద్వారా మీకు తెలియజేయమన్నారు. కాబట్టి అధికారులు ఇప్పటికైనా చట్టబద్ధంగా పనిచేయాలి. సజ్జల, అంబటి లాంటి వైసీపీ నేతలు పిచ్చివాగుడును కట్టిపెట్టాలి. టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. అమరావతికి ప్రధాని వచ్చి రాజధాని కోసం ఎక్కడైతే శంకుస్థాపన చేశారో అక్కడే ముఖ్యమంత్రిగా చంద్రబా బు ప్రమాణ స్వీకారం చేయాలని నేను కోరుకుంటున్నా అని వ్యాఖ్యానించారు.