-కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండండి
-చీఫ్ ఏజెంట్లతో సజ్జల రామకృష్ణారెడ్డి
తాడేపల్లి: వైసీపీ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వస్తుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నెల 9వ తేదీన ప్రమాణస్వీకారం ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ సమయంలో వైసీపీ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో బుధ వారం కౌంటింగ్ ఏజెంట్లకు వర్క్‌షాప్, జూమ్ మీటింగ్ జరిగాయి. పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్‌చార్జ్, శాసనమండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిóగా సజ్జల పాల్గొని దిశానిర్దేశం చేశారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వారికి అనుకూలంగా నిర్ణయాలు వచ్చేలా పనిచేస్తున్నారని, ఈసీ తీరు అనుమానంగా ఉందన్నారు. రిటైర్డ్ ఆర్డీవో ప్రభాకర్ సందేహాలు నివృత్తి చేశారు.