సచివాలయం/వెలగపూడి, మహానాడు : గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠిని బదిలీ చేయాలని, అనంతపురం ఏఎస్పీ రామకృష్ణను సస్పెండ్ చేయాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి శుక్రవారం వైసీపీ నాయకులు మల్లాది విష్ణు, రావెల కిషోర్‌బాబు, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి ఫిర్యాదు చేశారు. పోలింగ్ రోజున మాచర్ల, సత్తెన పల్లి, గురజాల, నరసరావుపేట, కొత్తగణేషునిపాడులో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల కు సంబంధించిన కుటుంబాల ఇళ్లలోకి చొరబడి టీడీపీ శ్రేణులు దౌర్జన్యం చేస్తే త్రిపాఠి వత్తాసు పలికారని పేర్కొన్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమె రాలను ధ్వంసం చేయడం, పోలీసుల దౌర్జన్యంపై ఫిర్యాదు చేశారు. ఇందుకు బాధ్యులైన అనంతపురం ఏఎస్పీ రామకృష్ణచౌదరిని సస్పెండ్ చేయాలని కోరారు.