– వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి అంగీకారం
విశాఖపట్నం, మహానాడు: ఉత్తరాంధ్రలో నియోజకవర్గాల పునర్విభజన వలన నియోజక వర్గాల సంఖ్య 44కి పెరగనున్నాయని, వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ విజయం లక్ష్యంగా పనిచేస్తామని, కార్యకర్తలను నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమేనని, మహిళా కోటా, రిజర్వేషన్లు మొత్తం మారిపోతాయి….ఆ పరిణామాలు అన్నీ చర్చించుకుని సంసిద్ధం అవుతున్నామని వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన విశాఖలో మీడియాతో ఏమన్నారంటే..
అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో కార్యకర్తలను నిర్లక్ష్యం చేసిన మాట యదార్థం… గతంలో జరిగిన లోపాలను సరిదిద్దుకుని క్షేత్ర స్థాయి నుంచి పార్టీ బలోపేతం కోసం చర్యలు మొదలు పెట్టాం…. విశాఖ ఉక్కుపై మా విధానంలో మార్పు లేదు… ప్రయివేటీకరణ కాకుండా అడ్డుకున్నది మేమే… ఉక్కు పరిరక్షణపై చంద్రబాబు చేతులెత్తేశారు…. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరు బాట పడతాం..
అమరావతి కోసం ఉత్తరాంధ్రకు అన్యాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి… రాష్ట్రం సమగ్ర అభివృద్ది జరగాల్సిన చోట ఒకే ప్రాంతంపై ఫోకస్ చెయ్యడం అంటే మిగిలిన ప్రాంతాలకు నష్టం చేయడమే…. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం విశాఖ నుంచి అమరావతికి తరలించుకుపోవడమే ఉదాహరణ.