తినబోతూ రుచి అడగవద్దు
మూడు నాలుగు రోజుల్లో పూర్తి క్లారిటీ
రాష్ట్రంలో ప్రజా కంటక పాలన అంతం అవ్వాలి
షర్మిలకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్
జాతీయ స్థాయిలో జరిగే వ్యవహారాల పై మాకు అవగాహన ఉండదు. అలాంటి విషయాలపై స్పందించడం సరికాదు, కొన్ని పరిమితులు ఉంటాయి. రాష్ట్రంలో ఏం జరగబోతుందో మీరే చూస్తారు. తినబోతూ రుచి అడగవద్దు. జరుగుతున్న ప్రచారాలు చూస్తే , మూడు నాలుగు రోజుల్లో పూర్తి క్లారిటీ వస్తుంది.
రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ప్రజా కంటక పాలన అంతం అవ్వాలి, ఆ నినాదంతోనే రాష్ట్ర బీజేపీ నాయకత్వం పనిచేస్తుంది… షర్మిలకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు . ముందు ప్రత్యేక హోదా అంటే ఏంటో తెలుసుకొని మాట్లాడాలి. ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో ఎందుకు చేర్చలేదో ఆమె ఉండే పార్టీ నే అడగాలి.
ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి :
పొత్తుల వ్యవహారం బిజెపి అగ్రనాయకత్వం చూసుకుంటుంది. చంద్రబాబు ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారో మాకు తెలియదు. చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారనేది మీడియా చెబుతుంటే చూస్తున్నాం. ఎప్పుడు, ఎవరితో భేటీ అవ్వాలో పొత్తులు ఎవరితో పెట్టుకోవాలో బిజెపి అగ్రనాయకత్వం చూసుకుంటుంది.