కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నివాసంలో ఏపీసీసీ చీఫ్ షర్మిల భేటీ అయ్యారు. ఎన్నికలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. ఎన్నికల ప్రచారానికి రావాలని శివకుమార్ ను ఈ సందర్భంగా షర్మిల కోరారు. తాను తప్పకుండా వస్తానని షర్మిలకు శివకుమార్ హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల ద్వారా ఏపీలో ఉనికిని చాటుకోవాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న కమ్యూనిస్టులతో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తోంది. కడప లోక్ సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేస్తున్నారు.