వీరఘట్టం : పార్వతీపురం మన్యం జిల్లాలో వీరఘట్టం మండలంలో తూడిలోని వైయస్సార్ విగ్రహాన్ని దుండగులు 2రోజుల క్రితం పాక్షికంగా ధ్వంసం చేసిన విషయం ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. గ్రామంలోని సచివాలయం గేటును విరగొట్టి సమీపంలో ఉన్న పంట పొలాల్లో విసిరేశారని స్థానికులు తెలిపారు.ఈ సంఘటనలపై పంచాయతీ కార్యదర్శి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వీరఘోట్టం ఎస్.ఐ కళాదర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.