Mahanaadu-Logo-PNG-Large

5 కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించిన యువగళం

-అరాచకపాలనపై సమరశంఖం పూరించిన యువగళం జైత్రయాత్ర
-కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ భరోసానిచ్చిన యువనేత లోకేష్‌
-226 రోజుల్లో 3132 కి.మీ సాగిన యువగళం పాదయాత్ర

అమరావతి: జగన్మోహన్‌ రెడ్డి అవినీతి, అరాచక పాలనలో బాధితులుగా మారిన ప్రజలకు నేనున్నానని భరోసా ఇచ్చేందుకు యువనేత లోకేష్‌ చేపట్టిన యువగళం జైత్రయాత్ర విజయవంతంగా పూర్తయింది. ఈ ఏడాది జనవరి 27వ తేదీన కుప్పం వరదరాజస్వామి పాదాలచెంత నుంచి ప్రారంభమైన యువగళం పాద యాత్ర 5 కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజాచైతన్యమే లక్ష్యంగా ముందుకు సాగింది. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు/మున్సిపాలిటీలు, 2,028 గ్రామాల మీదుగా 226 రోజులపాటు 3132 కి.మీ మేర యువగళం పాదయాత్ర సాగింది. ఉద్యోగా ల్లేక నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న యువత ఒకవైపు… ఇంటినుంచి బయటకు వెళితే తిరిగి క్షేమంగా తిరిగివస్తామనే గ్యారంటీ లేక భయాందోళనలతో బతుకుతున్న మహిళలు మరోవైపు, అడ్డగోలు బాదుడుతో బతుకుభారంగా మారిన జనసామాన్యం ఇంకోవైపు.. ఇలా అడుగడుగునా అభద్రతాభావం, నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు నేనున్నానంటూ లోకేష్‌ భరోసా నిచ్చారు. ప్రజల కష్టాలు వింటూ, కన్నీళ్లు తుడుస్తూ సాగిన యువగళం పాద యాత్ర ప్రజాచైతన్యంలో సంపూర్ణ విజయం సాధించింది.

విరామం లేకుండా సాగిన యాత్ర
యువగళం పాదయాత్ర జగన్మోహన్‌ రెడ్డి మాదిరి శని, ఆదివారాల్లో వీక్లీ ఆఫ్‌లతో ఆషామాషీగా ముందుకు సాగలేదు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్టు, తారకరత్న మరణం వంటి అనివార్యమైన పరిస్థితుల్లో మినహా ఎటువంటి విరా మం లేకుండా నారా లోకేష్‌ పాదయాత్ర సాగింది. రాయలసీమలో 48 డిగ్రీల మండుటెండల్లో సైతం యువగళం ఆగలేదు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జోరువర్షంలో సైతం యాత్రను కొనసాగించారు. పాదయాత్ర నంద్యాల చేరుకున్న సమయంలో అభిమానుల తాకిడికి చేయినొప్పితో బాధపడుతున్న సమయంలో కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పినా యువనేత లెక్కచేయలేదు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉక్కుసంకల్పంతో లక్ష్యంగా దిశగా పయనించారు యువనేత లోకేష్‌. యువగళం పాదయాత్రలో యువనేత లోకేష్‌ 70 బహిరం గసభలు, 155 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబం డ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల నుంచి రాతపూర్వకంగా 4,353 వినతిపత్రాలు అందగా, లక్షలాది ప్రజలు నేరుగా యువనేతను కలుసుకుని తమ కష్టాలు చెప్పుకున్నారు. లోకేష్‌ను కుటుంబసభ్యుడి మాదిరిగా భావించి బాధలు చెప్పుకుంటూ జనం నీరాజనాలు పట్టారు. 226 రోజు ల సుదీర్ఘ పాదయాత్రలో కోటిన్నర మంది ప్రజలు యువనేతతో కనెక్ట్‌ అయ్యారు. జనగళమే యువగళంగా సాగిన లోకేష్‌ పాదయాత్ర పాదయాత్ర ప్రజాచైతన్యం సాధించడంలో అంచనాలకు మించి విజయవంతమైంది.

ఉమ్మడి జిల్లాల వారీగా యువగళం పాదయాత్ర వివరాలు:
1). చిత్తూరు: 14 నియోజకవర్గాలు: 45 రోజులు: 577 కి.మీ.
2). అనంతపురం: 9 నియోజకవర్గాలు: 23 రోజులు: 303 కి.మీ.
3). కర్నూలు: 14 నియోజకవర్గాలు: 40 రోజులు: 507 కి.మీ.
4). కడప: 7 నియోజకవర్గాలు: 16 రోజులు: 200 కి.మీ.
5). నెల్లూరు: 10 నియోజకవర్గాల: 31 రోజులు: 459 కి.మీ.
6). ప్రకాశం: 8 నియోజకవర్గాలు: 17రోజులు: 220 కి.మీ.
7). గుంటూరు: 7 నియోజకవర్గాలు: 16 రోజులు: 236 కి.మీ.
8). కృష్ణా జిల్లా: 6 నియోజకవర్గాలు: 8 రోజులు: 113 కి.మీ
9). పశ్చిమగోదావరి: 8 నియోజకవర్గాలు: 11 రోజులు: 225.5 కి.మీ.
10). తూర్పుగోదావరి: 9 నియోజకవర్గాలు: 12 రోజులు: 178.5 కి.మీ.
11). విశాఖపట్నం జిల్లా: 5 నియోజకవర్గాలు: 7 రోజులు: 113 కి.మీ.
12) మొత్తం: 97 నియోజకవర్గాలు: 226 రోజులు: 3132 కి.మీ.

యువగళం గొంతునొక్కేందుకు విఫలయత్నాలు!యు
వగళం పాదయాత్రకు ప్రజలనుంచి వస్తున్న అనూహ్య స్పందనతో ప్రభుత్వ పెద్దల్లో వణుకు మొదలైంది. భీమవరం, ఉంగుటూరు, గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లో వైసిపి ముష్కరమూకలు, పోలీసులు కలిసి పసుపుసైనికులను రెచ్చగొట్టి తిరిగే వారిపైనే తప్పుడు కేసులు బనాయించారు. 40 మంది యువగళం వాలంటీర్లను నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టి రాజమండ్రి జైలుకు పంపారు. గన్నవరం నియోజకవర్గంలో విదేశాల్లో ఉన్నవారితో సహా 46 మంది కీలక నాయకులపై తప్పుడు కేసులు పెట్టడం అధికారపార్టీలో నెలకొన్న భయానికి అద్దంపడుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో యువనేత ప్రచారరథం మొదలు నిలబడే స్టూల్‌ వరకు అన్నీ లాగేసి గొంతునొక్కే ప్రయత్నం చేశారు. యువనేత లోకేష్‌ ఏ మాత్రం వెన్నుచూపకుండా కోట్లాదిమంది ప్రజల గొంతుకనే తన గళంగా వినిపిస్తూ రెట్టింపు ఉత్సాహంతో ముందుకుసాగారు. కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభం మొదలు తంబళ్లపల్లి నియోజకవర్గం వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతి 20 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తంగా 25 పోలీసు కేసులు నమోదయ్యాయి. ఇందులో యువనేత లోకేష్‌పై 3 కేసులు నమోదు చేశారు. ప్రచార రథం, సౌండ్‌ సిస్టమ్‌, మైక్‌, స్టూల్‌తో సహా అన్నింటినీ పోలీసులు సీజ్‌ చేశారు. ఎంతలా వేధించినా, ఎన్ని తప్పుడు కేసులు బనాయించినా క్రమశిక్షణకు మారుపేరైనా లోకేష్‌ నేతృత్వంలో యువగళం బృందాలు మొక్కవోని పట్టుదలతో ముందుకు సాగుతున్నాయి. యువగళాన్ని స్వాగతిస్తూ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చించడం, రాళ్లు రువ్వడం, పసుపు సైనికులు తిరగబడితే పారిపోవడం వైసీపీ పేటీిఎం బ్యాచ్‌కు అలవాటుగా మారింది.

అడ్డంకులు సృష్టించినా అడుగు ముందుకే!
యాత్రను అడ్డుకునేందుకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తగ్గేదే లేదంటూ పట్టువద లని విక్రమార్కుడిలా లోకేష్‌ ముందుకు సాగిన తీరు టీడీపీ కేడర్‌లో నూతనో త్సాహాన్ని నింపింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి తూర్పుగోదావరి వరకు యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు అధికారపార్టీ చేయని కుట్రలు లేవు. అయితే ఉక్కు సంకల్పంతో యజ్ఞంలా సాగుతున్న యువగళాన్ని అడ్డుకోవడం వైసీపీ ముష్కరమూకల వల్లకాలేదు. చైతన్యానికి మారుపేరైన విజయవాడ వంటి నగరంలో ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి తెల్లవారుజాము 3.30 వరకు ఎదురుచూడటం యువనేత లోకేష్‌పై నెలకొన్న అభిమానం, నమ్మకానికి అద్దం పడుతోంది. యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా దాటకముందే రాష్ట్రంలో 108 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుపార్టీ విజయ దుందుభి మోగించడంతో అధికారపార్టీలో ప్రకంపనలు చెలరేగాయి. లోకేష్‌ పాదయాత్ర ప్రజాచైతన్యంలో సంపూర్ణంగా విజయం సాధించింది.

రాయలసీమలో రికార్డు సృష్టించిన యువగళం
గతంలో ఏ నాయకుడు చేయని విధంగా రాయలసీమలో సుదీర్ఘ పాదయాత్రతో యువనేత లోకేష్‌ రికార్డు సృష్టించారు. 124 రోజులపాటు 44 అసెంబ్లీ నియోజక వర్గాల మీదుగా 1587 కి.మీ మేర సీమలో యువగళం పాదయాత్ర కొనసాగింది. అనుక్షణం ప్రజల్లో మమేకమవుతూ యువనేత పాదయాత్ర సాగింది. రాయలసీమ లో యువగళానికి లభించిన అపూర్వస్పందన అధికారపార్టీ పెద్దలకు కంటిమీద కునుకులేకుండా చేసింది. పాదయాత్రను అడ్డుకునేందుకు అధికార పార్టీ అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఉక్కుసంకల్పంతో సాగిన యువగళాన్ని అడ్డుకోవడం వారి తరం కాలేదు.

ఉత్తరాంధ్ర ప్రజల బ్రహ్మరథం
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇచ్చాపురం వరకు చేయాలనుకున్న యువగళం పాదయాత్రను యువనేత లోకేష్‌ అనివార్య పరిస్థితుల్లో విశాఖ జిల్లా అగనంపూడి వద్దే ముగించాల్సి వచ్చింది.ఉమ్మడి విశాఖ జిల్లాలో 7 రోజులు, 113 కి.మీ మాత్రమే యాత్ర కొనసాగినప్పటికీ ప్రజలు అడుగడుగునా యువనేతకు బ్రహ్మ రథం పట్టారు. పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి, పెందుర్తి, గాజువాక నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్ర సాగింది. లక్షలాది ప్రజలు, అభిమాను లు, మహిళలు, టిడిపి-జనసేన కార్యకర్తలు యువనేతకు నీరాజనాలు పట్టారు. మహిళలు, బిసిలు, రిటైర్డ్‌ ఉద్యోగులు, మత్స్యకారులు, యాదవులు, అగ్రిగోల్డ్‌ బాధితులు, మీసేవా ఉద్యోగులతో లోకేష్‌ ముఖాముఖి సమావేశాలు నిర్వహించి వారి సమస్యలపై లోతైన అధ్యయనం చేసి పలు హామీలు ఇచ్చారు.

ఉభయగోదావరి జిల్లాల్లో జేజేలు
చైతన్యానికి మారుపేరైన ఉభయగోదావరి జిల్లాల్లో 17 నియోజకవర్గాల పరిధిలో 23రోజులపాటు సాగిన యువగళం పాదయాత్ర జనజాతరను తలపించింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 8నియోజకవర్గాలు, 11రోజులు, 225.5 కి.మీలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 9 నియోజకవర్గాలు, 12రోజులు 178.5 కి.మీ.లు కలిపి మొత్తం 404 కి.మీ.ల మేర యువగళం పాదయాత్ర కొనసాగింది. పల్లెలు, పట్టణాలని తేడా లేకుండా అన్నివర్గాల ప్రజలు యువనేతకు ఆత్మీయస్వాగతం పలికారు. రాజోలు, పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ రూరల్‌, కాకినాడ సిటీ, పెద్దాపురం, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా యువగళం ముందుకు సాగింది.పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు నేపథ్యంలో 79రోజులపాటు సుదీర్ఘ విరామానంతరం రాజోలు నియోజకవర్గం పొదలాడ వద్ద నవంబర్‌ 27న పునఃప్రారంభమైన యువగళం 2.0లో ప్రజలు గతం కంటే రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నారు.

పదునైన ప్రసంగాలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లుయు
వనేత లోకేష్‌ తాను పాదయాత్ర నిర్వహించే అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బహిరంగసభలు నిర్వహించి మాటల తూటాలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర సాగిన 97అసెంబ్లీ నియోజకవర్గాల్లో 70 చోట్ల యువనేత లోకేష్‌ బహిరంగసభల్లో ప్రసంగించారు. రాష్ట్రంలో నాలుగేళ్ల జగన్మోహన్‌ రెడ్డి పాలనా వైఫల్యాలు, దోపిడీ విధానాలను ఎండగట్టడమేగాక, ప్రతి బహిరంగసభలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ఆధారాలతో సహా బట్టబయలు చేస్తుండటంతో అధికారపార్టీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. సమాధానం చెప్పలేని అధికారపార్టీ ఎమ్మెల్యేలు వ్యక్తిగత దూషణలతో ఎదురుదాడికి దిగారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయా నియోజకవర్గాల్లో తాము ఏంచేస్తామని స్పష్టంగా చెబుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరిన తీరు ప్రజలను ఆకట్టుకుంది.

సెల్ఫీ చాలెంజ్‌తో అధికారపార్టీ ఉక్కిరిబిక్కిరి!
యువగళం పాదయాత్ర దారిలో టిడిపి హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల తాలుకూ విజయగాథలు, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ లోకేష్‌ విసురుతున్న సెల్ఫీ చాలెంజ్‌లు అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు – వైసీపీ పాలనలో సాగుతున్న విధ్వంసం, అవినీతిని సెల్ఫీలతో వివరిస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు. పాదయాత్ర సాగే సమయంలో ఎక్కడ ఎవరి బండారాన్ని లోకేష్‌ బయటపెడతారోనని అధికార పార్టీ శాసనసభ్యు లు భయపడే పరిస్థితి నెలకొంది.

సెల్ఫీ విత్‌ లోకేష్‌ కార్యక్రమానికి అనూహ్య స్పందన
ప్రతిరోజూ తనను కలవడానికి వచ్చే కార్యకర్తలు, అభిమానులతో సెల్ఫీ విత్‌ లోకేష్‌ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి అనూహ్య ఆదరణ లభించింది. 226 రోజుల సుదీర్ఘ పాదయాత్రలో యువనేత లోకేష్‌ 3.5 లక్షల మందికి పైగా అభిమానులతో ఫొటోలు దిగారు. నెల్లూరులో అత్యధికంగా ఒకేరోజు 2,500 మంది యువనేతతో సెల్ఫీ దిగారు. ఈ కార్యక్రమం కారణంగా నంద్యాల నియో జకవర్గంలో యాత్ర చేస్తున్న సమయంలో లోకేష్‌ కు తీవ్రమైన రెక్కనొప్పి వచ్చింది. ఈ సమయంలో సెల్ఫీలు వద్దని వ్యక్తిగత వైద్యులు వారించిన యువనేత వినలేదు. అభిమానులను నిరాశపర్చకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. యువనేతతో సెల్ఫీ దిగిన వారి ఫొటోలను స్కానింగ్‌ చేయించి ఫేస్‌ రికగ్నషన్‌ టెక్నాలజీ ద్వారా వారి ఫోన్లకే చేరేవిధంగా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు ఫొటోలను అప్‌లోడ్‌ చేశారు. సెల్ఫీ విత్‌ లోకేష్‌ కార్యక్రమంతో పాటు దారిపొడవునా తనను కలిసేందుకు వచ్చిన ఏ ఒక్కరినీ నిరాశపర్చకుండా ఓపికగా ఫొటోలు దిగారు.

సమస్యలపై యంత్రాంగానికి లేఖలు
పాదయాత్రలో తమ దృష్టికి వచ్చిన క్లిష్టసమస్యలపై యువనేత లోకేష్‌ వేగంగా స్పందించారు. 226 రోజుల సుదీర్ఘ పాదయాత్రలో వివిధ సమస్యలపై లోకేష్‌ అధికార యంత్రాంగానికి 600కు పైగా లేఖలు రాశారు. కమ్యూనిటీపరంగా సమస్యలతోపాటు పెన్షన్లు, ఇళ్లు, విద్య,వైద్యపరమైన పలు వ్యక్తిగతమైన వినతి పత్రాలను కూడా లోకేష్‌ యంత్రాంగానికి రిఫర్‌ చేస్తూ లేఖలు రాశారు. వాటిలో కొన్నింటిపై యంత్రాంగం స్పందించి సమస్యలను పరిష్కరించగా రాజకీయ వత్తిళ్లతో కూడిన సమస్యలపై మాత్రం అధికారులు స్పందించలేదు.

లోకేషన్నా అని పిలిచిన వెంటనే నేనున్నానంటూ…!
పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో యువనేత లోకేష్‌ను లక్షలాది ప్రజలు కలుసుకొని తమ సమస్యలను యువనేతకు చెప్పుకున్నారు. ఇందులో కొందరు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కన్నీళ్లు పెట్టుకున్న సమయంలో యువనేత లోకేష్‌ వారిని ఊరడిరచి నేనున్నానంటూ అండగా నిలచారు. సమస్య తీవ్రతను బట్టి ప్రతిజిల్లాలోనూ యువనేత లోకేష్‌ వ్యక్తిగత నిధులతో సాయమందించారు. సంబంధిత బాధితుల వివరాలు తీసుకొని, వారికి సాయం అందించేవరకు సహాయకుల ద్వారా వాకబుచేస్తూ ఆపన్నుల్లో ధైర్యం నింపారు.

1. ఇద్దరి బిడ్డల చదువు బాధ్యత తీసుకుంటా: ఏప్రిల్‌ 2న ధర్మవరంలో చేనేతలతో నారా లోకేష్‌ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత వర్గానికి చెందిన రాములమ్మ అనే మహిళ అప్పుల బాధతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని కన్నీరుమున్నీరైంది. దీంతో చలించిపోయిన లోకేష్‌..ఆమె ఇద్దరి బిడ్డల చదువు బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.

2. దళిత రైతు రంగమ్మకు తక్షణ సాయంగా లక్ష అందజేత : ఏప్రిల్‌ 30, ఏప్రిల్‌ 28న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రైతులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో ఓ దళిత మహిళా రైతు రంగమ్మ తన బాధను వెల్లబోసుకుంది. 12 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేయడం వల్ల రూ.30 లక్షల అప్పవ్వడంతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పగానే..రంగమ్మకు రూ.1 లక్ష సాయాన్ని నారా లోకేష్‌ ప్రకటించారు. ఆ సాయాన్ని ఎమ్మిగనూరులో 30వ తేదీన రంగమ్మకు అందించారు. అధికారంలోకి వచ్చాక రూ.10 లక్షలు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

3. మునిరాజమ్మకు రూ.5 లక్షల సాయం : శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రజక మహిళ మునిరాజప్ప యువనేతకు తన కష్టాలు చెప్పుకున్నారు. దీన్ని ఓర్చుకోలేక వైసీపీ నేతలు టిఫిన్‌ కొట్టు ధ్వంసం చేసి నడివీధిలో ఆమె చీర వితప్పుతామని బెదిరించారు. ఆమె భర్త గుడిలో సెక్యూరిటీగా చేస్తుంటే తొలగించారు. ముని రాజమ్మకు కొత్తషాపు ఏర్పాటు చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు 28.02. 2023న రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఆమె భర్తకు ఉద్యోగం ఇస్తామని చెప్పారు.

4. కొత్త ఆటో అందించిన లోకేష్‌ : రోజా ఇంటికి ఆటోలో టీడీపీ మహిళా నేతలు చీరలు, గాజులు ఇవ్వడానికి వెళ్లారు. ఈ సందర్భంలో మహిళా నేతలను అరెస్టు చేయడంతో పాటు, వారు వెళ్లిన ఆటోను కూడా పోలీసులతో రోజా సీజ్‌ చేయిం చారు. హమీద్‌ బాషా తన ఆటోతోనే కుటుంబ జీవినం సాగుతుందని బాధను వ్యక్తం చేశాడు. దీంతో తాను కొత్తఆటో కొనిస్తానని చెప్పిన మాట ప్రకారం యువనేత లోకేష్‌ 24-2-2023న కొత్త ఆటో హమీద్‌ బాషాకు అందించారు.

5. శ్రీశైలం నియోజకవర్గంలో 16.05.2023న పాదయాత్ర సాగిన నేపథ్యంలో బండిఅత్మకూరు మండలం పార్నపల్లెకు చెందిన ముస్లిం మహిళ షేక్‌.హుసేన్‌ బేగ్‌ హజ్‌ యాత్రకు వెళ్లేందుకు ఆర్థికసాయం కావాలని అభ్యర్థించగా లక్షన్నర అందించారు.

6. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలం మినగల్లు గ్రామానికి చెందిన సీనియర్‌ టిడిపి కార్యకర్త చిట్టిబోయిన పెద్ద వెంగయ్యని 16.06.2023న వైసీపీ నేతలు అత్యంత దారుణంగా హతమా ర్చారు. వైసీపీ ఇంటి పెద్దని అంతమొందిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యతని తెలుగుదేశం తీసుకుంది. యువగళం పాదయాత్రలో భాగంగా అనంతసాగరంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగసభలో మృతుడు భార్య ధన లక్ష్మమ్మకి రూ.5 లక్షలు ఆర్థిక సాయాన్ని నారా లోకేష్‌ అందజేశారు.

7. కర్నూలులోని ప్రకాష్‌ నగర్‌లో 20.06.2023న 49వ వార్డుకు చెందిన రాము కుటుంబంతో కలిసి తమ ప్రాంతానికి వచ్చిన లోకేష్‌కు హారతి ఇచ్చారు. దీంతో కక్ష కట్టిన వైసీపీ కార్పొరేటర్‌ కృష్ణ కాంత్‌..40 ఏళ్లుగా రాము ఉపాధి పొందుతోన్న కూరగాయల దుకాణాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చివేయించాడు. పాదయాత్రలో సమా చారం తెలుసుకున్న లోకేష్‌…కూరగాయల దుకాణం నిర్మించేందుకు, కూరగాయలు కొని వ్యాపారం చేసేందుకు పెట్టుబడిగా సాయం ప్రకటించారు.

8.ఆకిలవలసలో వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు(19.06.2023) : గ్రామంలో తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని రచ్చబండలో గ్రామస్తులు లోకేస్‌ దృష్టికి తీసుకురాగా ..ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా గ్రామంలో వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వచ్చేదాకా ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా ఏర్పాటు చేసిన వాటర్‌ ప్లాంట్‌ ద్వారా నీరందిస్తామని, ప్రభుత్వం వచ్చాక శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.

9.మృతిచెందిన కార్యకర్త కుటుంబానికి లోకేష్‌ భరోసా! (27.06.2023) : గూడూరు నియోజకవర్గం చిట్టమూరులో ఇటీవల రోడ్డుప్రమాదంలో మృతిచెందిన వెంకటరమణ అనే కార్యకర్త కుటుంబసభ్యులు యువనేత నారా లోకేష్‌ ను కలిశారు. కుటుంబ పెద్దదిక్కును కోల్పోయిన తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని మృతుడి భార్య నాగమణి ఆవేదన వ్యక్తంచేసింది. వారి ఇద్దరు పిల్లలను దగ్గరకు తీసుకుని ఓదార్చిన యువనేత లోకేష్‌ కార్యకర్తల సంక్షేమ నిధినుంచి ఆదుకుంటామని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.

10.పిల్లల్ని చదివించే బాధ్యత నేను తీసుకుంటా (03.07.2023) : గూడూరు నియోజకవర్గం చెన్నూరుకు చెందిన వెంటకలక్ష్మమ్మ కూతురును అల్లుడు దారుణంగా హత్య చేశాడు. దీంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ముగ్గరు మనవళ్లను చదివించే స్తోమత తనకు లేదని చెప్పడంతో…వారి చదివించే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని లోకేష్‌ భరోసా ఇచ్చారు.

11.దివ్యాంగుడికి ట్రై సైకిల్‌ అందజేత(13.07.2023) : నెల్లూరు జిల్లా, గూడూరు నియోజకవర్గం, కోట మండలం, వంజివాక గ్రామంలో యువగళం పాదయాత్రలో భాగంగా లోకేష్‌ పర్యటిస్తున్న సందర్బంలో సలవాది శ్రీనివాసులు అనే దివ్యాంగుడు లోకేష్‌ ను కలిసి తన ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, ఎక్కడికన్నా వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నానని, తనకు ట్రై సైకిల్‌ ఇప్పించాలని కోరారు. దీనికి స్పందించిన లోకేష్‌ ట్రై సైకిల్‌ అందించే బాధ్యత తనదని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ట్రై సైకిల్‌ ను 13.07.2023న తన ఇంటికి పంపించారు.

12.విద్యార్థి ఆవేదన విని స్పందించిన లోకేష్‌(28.11.2023) : ఓ విద్యార్థి ఆవేదనను విన్న టీడీపీ యువనేత నారా లోకేష్‌… ఆ తమ్ముడిని చదివించే బాధ్యత నేను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. అమలాపురం నియోజకవర్గం భట్నవిల్లిలో యువత తో ముఖాముఖి నిర్వహించిన యువనేత వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అమలాపురం నియోజకవర్గం కోడుపాడుకు చెందిన కె.అమలాపురం లోని ఎస్‌కేబీఆర్‌ కళాశాలలో గత ఏడాది ఇంటర్‌ హెచ్‌ఈసీ గ్రూప్‌లో జాయిన్‌ అయ్యాను. అక్కడ సరైన సదుపాయాలు లేక చదువు మానేశాను. తర్వాత ఐటిఐ చదువుతానని నాన్నతో చెబితే … మనకు అంత స్థోమత లేదు, వద్దన్నారని చెప్పాడు. యువనేత లోకేష్‌ స్పందిస్తూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు ఆపేసిన దుర్గారెడ్డిని తాను చదివిస్తానని ప్రకటించారు.

13.బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులకు రూ.2 లక్షల ఆర్థిక సాయం.(12.12.2023) : అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం నియోజకవర్గం, తామరం గ్రామానికి చెందిన పెద్దలక్ష్మీ కుమారుడు సాయి…వైసీపీ నేతల అక్రమ ఇసుక తోలకాల్లో భాగంగా తమ కుమారుడుని ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో మృతి చెందాడు. దీంతో వారి కూతురు పెళ్లి ఆగిపోయింది. ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు యువనేత నారా లోకేష్‌ రూ.2 లక్షల సాయం అందించారు.

14.దివ్యాంగురాలికి ట్రై సైకిల్‌ స్కూటీ(12.12.2023): పాయకరావుపేట నియోజక వర్గంలో మహిళలతో ముఖాముఖి సందర్భంగా…బంగారుపేట చెందిన చవాకుల వెంకటలక్ష్మీ అనే దివ్యాంగురాలు పోలియో వ్యాధితో ఇబ్బంది పడుతున్నాను ..పుట్టుక తోనే అంగవైకల్యంతో బాధపడుతున్న వెంకటలక్ష్మీ ఎక్కడికైనా వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నాని పేర్కొన్న నేపథ్యంలో ఆమెకు ట్రై సైకిల్‌ స్కూటీ అందిస్తానని హామీ ఇచ్చారు.

ఆకట్టుకున్న ప్రత్యేక కార్యక్రమాలు
యువగళం సందర్భంగా ప్రతిజిల్లాలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు మరే ఇతర జిల్లాల్లో లేనివిధంగా గుంటూరు జిల్లాలో 3 చోట్ల యువనేత లోకేష్‌ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొత్తం ఇప్పటివరకు నిర్వహిం చిన 12 ప్రత్యేక కార్యక్రమాలకు ప్రజలనుంచి పెద్దఎత్తున స్పందన లభించింది. యువత, మహిళలు, బిసిలు, ఎస్సీలు, రైతులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశాల్లో ఆయావర్గాలకు టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం చేయబోతున్నామో విస్పష్టంగా చెప్పారు.

1. తాజాగా యువగళం పాదయాత్ర 216వరోజు (3-12-2023)న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం పొన్నాడ శీలంవారిపాకలు వద్ద ఎస్సీ సామాజిక వర్గీయులతో దళిత గళం పేరిట ప్రత్యేక కార్యక్రమాని దళితులనుంచి అనూహ్య స్పందన లభించింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో జగన్‌ ప్రభుత్వం ఆపేసిన 27 ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తాం, విదేశీశిద్య, బెస్ట్‌ ఎవైలబుల్‌, పీజీ ఫీజు రీఎంబర్స్‌ మెంట్‌ కార్యక్రమాలతో పాటు ఎస్సీ విద్యార్థులకోసం డిగ్రీ గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేస్తాం. ఎటువంటి మళ్లింపులు లేకుండా చట్టప్రకారం సబ్‌ ప్లాన్‌ నిధులను ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికే ఖర్చుచేస్తామని చెప్పారు.
2. తిరుపతిలో 2-2-2023న యువతతో నిర్వహించిన హలో లోకేష్‌ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున యువతీయువకులు తరలివచ్చారు. యువత భవిష్యత్‌ కోసమే తాను యువగళం ప్రారంభించినట్లు చెప్పారు. యువత విషయంలో తెలుగుదేశం పార్టీ విధానాన్ని యువనేత వ్యక్తీకరించారు.3. అనంత
పురం జిల్లా శింగనమలలో 8-4-2023న నిర్వహించిన రైతన్నతో లోకేష్‌ కార్యక్రమానికి భారీఎత్తున రైతులు తరలివచ్చి తమ అభిప్రాయాలను యువనేతకు తెలియజేశారు. టిడిపి అధికారంలోకి వచ్చాక పోలవరాన్ని పూర్తిచేసి, గోదావరి మిగులుజలాలను రాయలసీమకు తెస్తామని, పెండిరగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. రైతులమోములో ఆనందం చూసినపుడే తన యాత్ర విజయవంతమైనట్లు అని లోకేష్‌ తెలిపారు.

4. పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా 24-4-2023న కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం తుంబళం క్రాస్‌ వద్ద పల్లెప్రగతి కోసం మీ లోకేష్‌ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీరహితంగా సర్పంచులు తరలివచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే పంచాయతీలకు నిధులు, విధులు కల్పిస్తా మని, వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటుతో గ్రామాల్లో 24/7 సురక్షితమైన తాగునీరు అందిస్తామని, సర్పంచ్‌లకు గౌరవవేతనంతో పాటు గౌరవం పెంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సచివాలయ వ్యవస్థను పంచాయితీలకు అనుసంధానిస్తామని తెలిపారు.
5. కర్నూలులో 7-5-2023న ముస్లిం మైనారిటీలతో నిర్వహించిన లోకేష్‌ తో గుఫ్తగు కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ముస్లిం సోదరులు తరలివచ్చి వైసిపి ప్రభుత్వం వచ్చాక తాము పడుతున్న కష్టాలు చెప్పుకున్నారు. జగన్‌ ప్రభుత్వ అసమర్థత వల్లే మైనారిటీలపై దాడులు పెరిగాయని, అధికారంలోకి వచ్చాక ముస్లింలకు రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, మైనారిటీల ఆస్తుల పరిరక్షణకు వక్ఫ్‌ బోర్డుకు జ్యుడీషియల్‌ అధికారాలు కల్పిస్తామని చెప్పారు.
6. రాయలసీమలో చివరిగా కడపలో 7-6-2023న మిషన్‌ రాయలసీమ పేరుతో రాయలసీమ మేధావులు, ప్రముఖులతో నిర్వహించిన కార్యక్రమంలో సీమ అభివృద్ధి విషయంలో టిడిపి విధానాన్ని యువనేత సాక్షాత్కరించారు.

7. నెల్లూరు అనిల్‌ గార్డెన్స్‌ లో 3-7-2023న ‘‘మహాశక్తితో లోకేష్‌’’ పేరుతో మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి జిల్లానలుమూలల నుంచి మహిళలు పెద్దఎత్తున హాజరయ్యారు. మహిళల వంక కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేస్తామని, తన తల్లికి జరిగిన అవమానాన్ని మరో చెల్లికి జరగనీయబోనని, నిర్భయ చట్టాన్ని కఠినంగా అమలుచేసి రక్షణ కల్పిస్తామని యువనేత ప్రకటించారు.
8. ఒంగోలు రవిప్రియ ఫంక్షన్‌ ఎదుట 27-7-2023న నిర్వహించిన జయహో బిసి సదస్సుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున బీసీలు తరలివచ్చారు. ఈ సదస్సులో వైసీపీ పాలనలో బాధితులైన పలువురు బిసి మహిళలు వ్యక్తంచేసిన ఆవేదన అందరినీ కంటతడి పెట్టించింది. సైకో పాలనలో సమాజం మొత్తం భయాందోళనలతో బతుకోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో బిసిల రక్షణ చట్టాన్ని అమల్లోకి తెస్తాం. అధికార మదంతో బిసిలను వేధించిన కామాంధులను రోడ్లపై వెంటాడి కటకటాల్లో పెడతామని యువనేత భరోసా ఇచ్చారు.
9. పెదకూరపాడు నియోజకవర్గం దొడ్లేరులో 10-8-2023న వైసీపీ బాధితులతో సమావేశమై వారికి భరోసా ఇచ్చారు. జిల్లానలుమూలల నుంచి వందలాది బాధితులు ఈ సమావేశానికి హాజరై యువనేతకు తమ కష్టాలు చెప్పుకున్నారు. కేసులకు కార్యకర్తలెవరూ భయపడాల్సిన పనిలేదు. అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీ కేడర్‌ పై పెట్టిన తప్పుడు కేసులన్నీ ఎత్తేస్తాం. పసుపు సైనికులు ధైర్యంగా ఉండండి… ఈ లోకేష్‌ మీకు అండగా నిలచి గుండెల్లో పెట్టుకొని కాపాడతాడని ధైర్యం చెప్పారు.

10. అమరావతి ఆవేదన పేరుతో 13-8-2023న తాడికొండ నియోజకవర్గం రావెలలో నిర్వహించిన కార్యక్రమానికి రాజధాని గ్రామాలనుంచి పెద్దఎత్తున రైతులు హాజరయ్యారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అమరావతి నిర్మాణం చేపడతాం, రైతులకు చెల్లించాల్సిన కౌలు బకాయిలన్నీ చెల్లిస్తాం. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం, అది చేసి చూపిస్తాం. అమరావతి రైతులను వేధించిన ఏ ఒక్కరినీ వదలం. వారిపై జ్యుడీషియల్‌ విచారణ జరిపించి ఉద్యోగాలనుంచి తొలగిస్తాం, అవసరమైతే కటకటాల వెనక్కి కూడా పంపిస్తాం. అమరావతి రైతులకు టీడీపీ అండగా ఉంటుంది. నిలిపేసిన పనులు పూర్తి చేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని చెప్పిన లోకేష్‌ అమరావతి రైతుల్లో ఆత్మస్థయిర్యాన్ని నింపారు.
11. హలో లోకేష్‌ పేరుతో 16-8-2023న మంగళగిరి నియోజకవర్గం యర్రబా లెంలో యువతతో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లానలుమూలల నుంచి పెద్దఎత్తున యువతీయువకులు హాజరై భవిష్యత్తుపై తమకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తాయని, మొదటి వందరోజుల్లోనే విశాఖకు ఐటి పరిశ్రమలు తెస్తామని యువనేత చెప్పారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాబట్టేందుకు తమ వద్ద చంద్రబాబు అనే బ్రాండ్‌ ఉందని అన్నారు.
12. యువగళం పాదయాత్ర 200వరోజుకు చేరుకున్న సందర్భంగా 31-8-2023న పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో యువనేత లోకేష్‌ గిరిజనులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి మూడేళ్లలో ప్రతి గిరిజనతాండాకు సురక్షితమైన తాగునీరు అందించడంతోపాటు రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని యువనేత నారా లోకేష్‌ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక రాయితీలు ఇచ్చి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు ఏర్పాటుచేసి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని తెలిపారు.

ప్రతి వంద కిలోమీటర్లకు ఒక వరం
యువగళం పాదయాత్ర సందర్భంగా యువనేత నారా లోకేష్‌ సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రతి వందకిలోమీటర్ల మజిలీలో ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తూ… తాము అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక తాము ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతే తమను నిలదీయవచ్చని చెబుతున్న దమ్మున్న నేత యువనేత నారా లోకేష్‌.

ఉమ్మడి చిత్తూరు జిల్లా:
– యువనేత పాదయాత్ర 8వరోజు (3-2-2023) పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యంలో 100 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా బంగారుపాళ్యంలో కిడ్నీవ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటుకు శిలఫలకాన్ని ఆవిష్కరించారు.
– 16వ రోజు (11-2-2023) జిడినెల్లూరు నియోజకవర్గం కత్తెరపల్లిలో 200 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో జిడి నెల్లూరులో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటుచేస్తామని ప్రకటించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
– 23వ రోజు (21-2-2023) శ్రీకాళహస్తి నియోజకవర్గం తొండమానుపురం వద్ద యాత్ర 300 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా అక్కడ 13 గ్రామాలకు తాగునీరందించే రక్షిత మంచినీటి పథకాన్ని అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో చేపడతామని ప్రకటించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
– యువగళం పాదయాత్ర 31వరోజు (1-3-2023) 400 కి.మీ చేరుకున్న సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నరేంద్రకుంట మజిలీలో ఆధునిక వసతులతో 10 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసేందుకు శిలాఫలకం వేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో నరేంద్రకుంటలో పీహెచ్‌ సీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
– 39వరోజు (9-3-2023)న మదనపల్లి శివారు చినతిప్పసముద్రంలో పాదయాత్ర 500వ రోజుకు చేరుకున్న సందర్భంగా మదనపల్లిలో టమోటా ప్రాసెసింగ్‌ యూనిట్‌, కోల్డ్‌ స్టోరేజి ఏర్పాటుచేస్తామని ప్రకటించారు.

ఉమ్మడి అనంతపురం జిల్లా
– 47వరోజు (19-3-2023) కదిరి నియోజకవర్గం చిన్నయ్యగారిపల్లి వద్ద పాదయాత్ర 600 కి.మీ. చేరుకున్న సందర్భంగా ఆ ప్రాంతంలో టెంపుల్‌ టూరిజం సర్క్యూట్‌ ఏర్పాటుచేస్తామని ప్రకటించారు.
– 55వరోజు (30-3-2023) పెనుగొండ నియోజకవర్గం గుట్టూరు వద్ద 700 కిలోమీటర్ల మైలురాయి చేరుకున్న సందర్భంగా గోరంట్ల, మడకశిర ప్రాంతాల తాగు,సాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి హంద్రీనీవా కాల్వ నుంచి ఎత్తపోతల పథకం నిర్మిస్తామని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
– యువగళం పాదయాత్ర 63వ రోజు (7-4-2023) 800 కిలోమీటర్ల మైలురాయి చేరుకున్న సందర్భంగా శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం మార్తాడు వద్ద చీనీ ప్రాసెసింగ్‌ యూనిట్‌ కు యువనేత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఉమ్మడి కర్నూలుజిల్లా
– యువగళం పాదయాత్ర 70వ రోజు (14-4-2023) నంద్యాల జిల్లా డోన్‌ నియోజకవర్గం ప్యాపిలిలో ఈరోజు 900 కి.మీ. మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా ఆలూరు, పత్తికొండ, డోన్‌, బనగానపల్లె నియోజకవర్గాల ప్రజలకు తాగు, సాగు నీరందించే గుండాల ప్రాజెక్టు నిర్మాణానికి శిలాఫలకం ఆవిష్కరించారు.
– ఆదోని సిరిగుప్ప క్రాస్‌ వద్ద 77వరోజు (21-4-2023) యువగళం పాదయాత్ర చారిత్రాత్మక 1000 కి.మీ. మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా ఆదోని టౌన్‌ వార్డ్‌ 21 ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 21వ వార్డులో త్రాగునీరు, డ్రైనేజ్‌, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇస్తూ శిలాఫలకం ఆవిష్కరించారు.
– ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగుడ్లలో 86వరోజు (1-5-2023)న యువగళం పాదయాత్ర 1100 కి.మీ. మైలురాయికి చేరుకుంది. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 10వేలమందికి ఉపాధి కల్పించే టెక్స్‌ టైల్‌ పార్కు ఏర్పాటుచేస్తామని హామీ ఇస్తూ, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
– యువగళం పాదయాత్ర 95వరోజు (10-5-2023)న నందికొట్కూరు నియోజకవర్గం అల్లూరులో 1200 కి.మీ మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా హంద్రీనీవా నుంచి మిడుతూరు ఎత్తిపోతల పథకానికి హామీ ఇచ్చి, శిలాఫలకాన్ని ఆవిష్క రించారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా మిడుతూరు, కలమండలపాడు, మాదిగుండం, పారమంచాల చెరువులకు నీరు చేరుతుంది. తద్వారా 22వేల ఎకరాల్లో సాగునీరు, మిడుతూరు, జూపాడుబంగ్లా మండలాల్లో 60 వేలమంది ప్రజలకు సాగునీరు అందుతుంది.
– యువగళం పాదయాత్ర 103వరోజు (18-5-2023) 1300 కి.మీ. మైలురాయి చేరుకున్న సందర్భంగా నంద్యాల యాతం ఫంక్షన్‌ హాలు వద్ద శిలాఫలకం ఆవిష్కరించారు. నంద్యాల రూరల్‌ కానాలలో టిడిపి అధికారంలోకి వచ్చాక పసుపు మార్కెట్‌, కోల్డ్‌ స్టోరేజి ఏర్పాటుకు హామీ ఇచ్చారు.

ఉమ్మడి కడప జిల్లా
– యువగళం పాదయాత్ర 109వరోజు (24-5-2023) జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె వద్ద యువగళం పాదయాత్ర 1400 కి.మీ. మజిలీని చేరుకుంది. ఈ సందర్భంగా గండికోట నిర్వాసితులకు ఉపాధి కల్పించే చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు లోకేష్‌ శిలాఫలకం ఆవిష్కరించారు. అధికారంలోకి వచ్చాక పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఇక్కడి రైతులు, యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు.
– యువగళం పాదయాత్ర 117వరోజు (5-6-2023) కడప అసెంబ్లీ నియో జకవర్గం ఆలంఖాన్‌ పల్లె వద్ద 1500 కి.మీ. మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా కడప నగరానికి మెరుగైన డ్రైనేజి వ్యవస్థ నిర్మాణానికి యువనేత లోకేష్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీనిద్వారా కడప నగరంలో మురుగునీటి తీరుతుందని చెప్పారు.

ఉమ్మడి నెల్లూరు జిల్లా:
– 126వరోజు (14-6-2023) యువగళం పాదయాత్ర ఎస్‌ పిఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం మర్రిపాడు మండలం చుంచులూరు వద్ద 1600 కి.మీ మైలురాయి చేరుకుంది.ఈ సందర్భంగా చుంచులూరులో హార్టికల్చర్‌ కోఆపరేటివ్‌ సొసైటీ ఏర్పాటుకి యువనేత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీనిద్వారా ఉద్యానవన పంటలు సాగుచేసే రైతులకి అన్నివిధాలా మేలు జరుగుతుంది.
– యువగళం పాదయాత్ర 132వరోజు (20-6-2023) యువగళం పాదయా త్ర తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కిలిలో 1700 కి.మీ. మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా డక్కిలిలో ఆప్కో హ్యాండ్లూమ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు హామీ ఇస్తూ, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీనివల్ల ఈ ప్రాంత చేనేతలకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
– యువగళం పాదయాత్ర 138వరోజు (26-6-2023) గూడురు నియోజక వర్గం గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం అరవపాలెం వద్ద 1800 కి.మీ. మజిలీకి చేరుకుంది. ఈ సందర్భంగా లోకేష్‌ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతంలో ఆక్వారైతులకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ ఇస్తూ, శిలాఫలాకాన్ని ఆవిష్కరిం చారు. వైసిపి పాలనలో కుదేలైన ఆక్వారంగానికి మేము అందించబోయే ప్రోత్సాహకాలు ఊతమిస్తాయని తెలిపారు.
– యువగళం పాదయాత్ర 147వరోజు (5-7-2023) కోవూరు నియోజకవర్గం సాలుచింతలలో 1900 కి.మీ. మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చాక రైతులు పండిరచిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి కోవూరు నియోజకవర్గవ్యాప్తంగా ప్లాట్‌ ఫారాలు నిర్మిస్తానని హామీ ఇస్తూ, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీనివల్ల ఈ ప్రాంత వరి రైతాంగం పండిరచిన ధాన్యం నాణ్యత మెరుగుపడి మార్కెట్‌ లో మంచి ధరకు విక్రయించుకోవడానికి అవకాశం కలుగుతుంది.
– యువగళం పాదయాత్ర 153వరోజు (11-7-2023) కావలి అసెంబ్లీ నియోజకవర్గం కొత్తపల్లి వద్ద చారిత్రాత్మక 2000 కి.మీ. మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా కొత్తపల్లిలో ఆక్వారైతులకు చేయూతనిచ్చే ఫిషరీస్‌ డెవలప్‌ మెంట్‌ బోర్డు ఏర్పాటుకు హామీ ఇస్తూ, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా
– యువగళం పాదయాత్ర 159వరోజు (19-7-2023) కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గం అజీస్‌ పురం వద్ద 2100 కి.మీ. మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా అజీస్‌ పురంలో సమ్మర్‌ స్టోరేజి ట్యాంకు నిర్మాణం చేపట్టి, ఇంటింటికీ కుళాయిల ద్వారా సురక్షితమైన తాగునీరు అందిస్తానని హామీ ఇస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
– యువగళం పాదయాత్ర 168వరోజు (28-7-2023)న ఒంగోలు నియోజకవర్గం త్రోవగుంట వద్ద 2200 కి.మీ. మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా ఒంగోలులో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు హామీ ఇస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఉమ్మడి గుంటూరు జిల్లా:
– యువగళం పాదయాత్ర 174వరోజు (3-8-2023) వినుకొండ నియోజకవర్గం కొండ్రముట్ల వద్ద 2300 కి.మీ. మైలురాయికి చేరుకుంది. ఈ సందర్భంగా వరికపూడిశెల ప్రాజెక్టుకు హామీ ఇస్తూ యువనేత లోకేష్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అంది పల్నాడు ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుంది. బొల్లాపల్లి మండలంలో ప్రజల సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
– యువగళం పాదయాత్ర 180వ రోజు (10-8-2023) పెదకూరపాడు నియోజకవర్గం దొడ్లేరులో 2400 కి.మీ. మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా ఎత్తిపోతల పథకానికి లోకేష్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీనివల్ల పెదకూరపాడు నియోజకవర్గంలో సాగు,తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
– యువగళం పాదయాత్ర 188వరోజు (19-8-2023)న మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో 2500 కి.మీ.ల మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలో నివసించే పేదలకు 20 వేల ఇళ్లు నిర్మిస్తానని హామీ ఇస్తూ శిలఫలకాన్ని ఆవిష్కరించారు. అసైన్డ్‌, ఇతర ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదల ఇళ్లను క్రమబద్దీకరణ చేసి పట్టాలు అందజేస్తానని మాటఇచ్చారు.

ఉమ్మడి కృష్ణాజిల్లా:
– యువగళం పాదయాత్ర 195వరోజు (26-8-2023) నూజివీడు నియోజకవర్గం సింహాద్రిపురం గ్రామం వద్ద 2600 కి.మీ.ల మైలురాయికి చేరుకుంది. ఈ సందర్భంగా చింతలపూడి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకానికి హామీఇస్తూ యువనేత లోకేష్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో దీనిని పూర్తిచేసి ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల మెట్ట ప్రాంతాలకు సాగు నీరందిస్తానని యువనేత హామీ ఇచ్చారు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా:
– రాష్ట్రంలో సైకోపాలనపై సమరభేరి మోగిస్తూ ప్రజాచైతన్యమే లక్ష్యంగా ప్రారంభించిన యువగళం పాదయాత్ర పోలవరం నియోజకవర్గం సీతంపేట వద్ద (31-8-2023)న200వరోజు 2700 కి.మీ.ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వైసీపీ సర్కారు వివిధ వర్గాల ప్రజలపై బనాయించిన తప్పుడు కేసులను అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా ఎత్తేస్తానని హామీఇచ్చిన లోకేష్‌ పైలాన్‌ ను ఆవిష్కరించారు. దీనివల్ల జగనాసురుడి పాలనలో బాధితులైన ప్రజలకు విముక్తి లభిస్తుందని చెప్పారు.
– భీమవరం అసెంబ్లీ నియోకవర్గం వెంప గ్రామంలో (6-9-2023)న 206వరోజు 2800 కి.మీ.ల మైలురాయి చేరుకున్న సందర్భంగా లోకేష్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆక్వారైతులకు మేలు కలిగించేలా జోన్లతో సంబంధం లేకుండా యూనిట్‌ రూ.1.50 పైసలకే అందిస్తానని హామీ ఇచ్చారు. దీనివల్ల ఆక్వారంగంపై ఆధారపడిన 18లక్షలమందికి మేలు కలుగుతుందని అన్నారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా:
– జనగళమే యువగళమై మహా ప్రభంజనంలా సాగుతున్న యువగళం పాదయాత్ర 212వరోజు (29-11-2023)న ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలం పాతఇంజరం వద్ద 2900 కి.మీ.ల మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా కల్లుగీత, కొబ్బరి దింపు కార్మికులకు భీమా అమలు చేస్తామని హామీ ఇస్తూ యువనేత లోకేష్‌ శిలాఫలకం ఆవిష్కరించారు. దీనివల్ల కోనసీమలోని వేలాది కార్మికులకు మేలు జరుగుతుంది.
– రాష్ట్రంలో అరాచకపాలన అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర చారిత్రాత్మక 3 వేల కి.మీ.ల మైలురాయి చేరుకున్న సందర్భంగా 219వరోజు (11-12-2023)న తుని నియోజకర్గం తేటగుంట యనమల అతిధిగృహం వద్ద యువనేత లోకేష్‌ పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.

ఉమ్మడి విశాఖ జిల్లా:
– యువగళం పాదయాత్ర 224వరోజు (16-12-2023) అనకాపల్లి నియోజకవర్గం జివిఎంసి 81వవార్డులోని గౌరి గ్రంథాలయం వద్ద 3100 కి.మీ.ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చాక చోడవరం %-% అనకాపల్లి మధ్య రైల్వే బ్రిడ్జి పూర్తిచేస్తామని హామీ ఇస్తూ యువనేత లోకేష్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

యువగళం విజయవంతంలో కీలకపాత్ర వహించిన కమిటీలు
యువగళం పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో ప్రత్యర్థులు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా 14నిర్వహణ కమిటీలు అనునిత్యం వెన్నంటే ఉంటూ యాత్ర విజయవంతంగా కొనసాగడంలో కీలకపాత్ర వహించాయి. ఇందులో పలువురిపై తప్పుడు కేసులను నమోదుచేసినప్పటికీ ఏ మాత్రం వెనక్కితగ్గకుండా ఈ కమిటీలు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాయి. ముఖ్యంగా యువగళం ప్రధాన కోఆర్డినేటర్‌ కిలారి రాజేష్‌ పై సిఐడి తప్పుడు కేసులు నమోదుచేసినా ఆయన ధైర్యంగా ఆ కేసులను ఎదుర్కొని పాదయాత్రను సక్సెస్‌ ఫుల్‌ గా ముందుకు నడిపించారు. 226 రోజులపాటు సాగిన యువగళానికి ఈ కమిటీలు దిక్సూచిగా నిలిచాయి.
1. యువగళం మెయిన్‌ కోఆర్డినేటర్‌: కిలారి రాజేష్‌.
2. వ్యక్తిగత సహాయక బృందం: తాతా నరేష్‌, కుంచనపల్లి వినయ్‌, పిన్నింటి మూర్తి.
3. వాలంటీర్స్‌ కమిటీ: అనిమిని రవినాయుడు, మానం ప్రణవ్‌ గోపాల్‌.
4. ఫుడ్‌ కమిటీ: మద్దిపట్ల సూర్యప్రకాష్‌, లక్ష్మీపతి.
5. మీడియా కమిటీ: మెయిన్‌ కో-ఆర్డినేటర్‌ బి.వి.వెంకటరాముడు, కాసరనేని జశ్వంత్‌.
6. పబ్లిక్‌ రిలేషన్స్‌ కమిటీ: కృష్ణారావు, కిషోర్‌, మునీంద్ర, చల్ల మధుసూదన రావు. ఫోటోగ్రాఫర్స్‌: సంతోష్‌, శ్రీనివాస్‌, కాశీప్రసాద్‌.
7. అలంకరణ కమిటీ: బ్రహ్మం చౌదరి, మలిశెట్టి వెంకటేష్‌.
8. అడ్వాన్స్‌ టీమ్‌ కమిటీ: డూండీ రాకేష్‌, నిమ్మగడ్డ చైతన్య, శ్రీరంగం నవీన్‌ కుమార్‌, చంద్రశేఖర్‌, నారాయణస్వామి.
9. రూట్‌ కోఆర్డినేషన్‌ కమిటీ: కస్తూరి కోటేశ్వరరావు (కెకె), కర్నాటి అమర్నాథ్‌ రెడ్డి.
10. కరపత్రాల పంపిణీ కమిటీ: అడుసుమిల్లి విజయ్‌, వెంకటప్ప, వంశీ, చీరాల నరేష్‌.
11. సెల్ఫీ కోఆర్డినేషన్‌ కమిటీ %-% వెల్లంపల్లి సూర్య, ప్రదీప్‌, శ్రీధర్‌ చౌదరి.
12. వసతుల కమిటీ %-% జంగాల వెంకటేష్‌, నారా ప్రశాంత్‌, లీలాధర్‌, బాబి, రమేష్‌.
13. తాగునీటి వసతి కమిటీ: భాస్కర్‌, చిరుమాళ్ల వెంకట్‌, అనిల్‌.
14. సోషల్‌ మీడియా: అర్జున్‌.

యువగళం పాదయాత్రలో వివిధవర్గాలకు ఇచ్చిన హామీలు

క్షత్రియ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలు
-అధికారంలోకి వచ్చాక మొదటి వందరోజుల్లో నిధులు కేటాయించి పేద క్షత్రియులకు చేయూతనందిస్తాం.
-భోగాపురం ఎయిర్‌ పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు.
-అమరావతిలో అల్లూరి మెమోరియల్‌ ఏర్పాటుచేస్తాం.
-పార్లమెంటులో కూడా అల్లూరి విగ్రహం ఏర్పాటుకు కృషి.
-మొగలి గ్రామంలో పది ఎకరాలు కేటాయించి దివంగత మూర్తిరాజుగారి విగ్రహం, స్మారక భవనం ఏర్పాటు.

రజక సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలు
-రజకుల దోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్‌
-ఆదరణ ద్వారా ఇచ్చిన వాషింగ్‌ మెషీన్లకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్‌
-తిరుపతిలో రజక భవన్‌ ఏర్పాటుకు కృషి
-దేవుడి వస్త్రాలు ఉతికేందుకు రజకులకే కేటాయించేలా చర్యలు
-అవసరమైన చోట బోర్లు వేయించి దోబీ ఘాట్ల నిర్మాణం

వడ్డెర సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలు
-వైసీపీ నేతలు లాక్కున్న క్వారీలు స్వాధీనం చేసుకుని తిరిగి వడ్డెర్లకు అప్పగింత.
-ప్రమాదాల్లో మరణించిన వడ్డెర్లకు చంద్రన్న బీమా.

యాదవ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలు
-యాదవ కార్పొరేషన్‌ నిధులు కేటాయింపు
-గోశాలలో యాదవులకు రిజర్వేషన్లపై చర్చించి… నిర్ణయం
-గోపాలమిత్రల పునరుద్ధరణ
-గోకులాలు పున:ప్రారంభం
-సబ్సిడీపై గొర్రెలు, ఆవులు అందజేసి, ఇన్సూరెన్స్‌ సౌకర్యం.
-22 గొర్రెలు యూనిట్‌ గా తీసుకుని సబ్సీడీలో అందిస్తాం.
-ఖాళీగా ఉన్న బంజరు భూములను గొర్రెలు మేపుకునేందుకు అప్పగిస్తాం.
-సబ్సిడీపై మేత పంపిణీ చేస్తాం.
-జీవాలను ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడేందుకు సబ్సిడీపై షెడ్లు నిర్మిస్తాం.

దళిత సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలు
-ఎస్సీ, ఎస్టీలకు గత ప్రభుత్వంలో అమలుచేసిన 27 సంక్షేమ పథకాల పునరుద్దరణ
-ఎస్సీలపై పెట్టిన అక్రమ కేసుల మాఫీ.
-కార్పొరేషన్‌ ద్వారా గతంలో అమలైన పథకాలు పునరుద్ధరణ.
-నియోజకవర్గ కేంద్రాల్లో కమ్యూనిటీ హాళ్లు.
-అంబేద్కర్‌ విదేశీవిద్య, స్టడీ సర్కిళ్ల పునరుద్దరణ.
-వర్గీకరణ విషయంలో మాదిగలకు సామాజిక న్యాయం.
-అమరావతిలో బాబూ జగజ్జీవన్‌ రామ్‌ విగ్రహం, విజ్ఞాన కేంద్రం

ఎస్టీ/లంబాడి సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలు:
-తాండాలకు సురక్షిత నీరు, రోడ్ల నిర్మాణం
-ఫైబర్‌ నెట్‌ ద్వారా ఇంటర్‌ నెట్‌ సదుపాయం
-బడ్జెట్‌ లో నిధులు కేటాయించి తాండాలలో దేవాలయాల నిర్మాణం.
-కదిరి నియోజకవర్గం కొక్కింటి క్రాస్‌ పరిధిలో వద్ద ఎస్టీ భవనం నిర్మాణం.
-పార్టీ పెద్దలతో చర్చించిన అనంతరం ఎస్టీలకు భూ పంపిణీపై నిర్ణయం

ముస్లిం సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలు:
-ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఏర్పాటు
-ముస్లింలకు ప్రత్యేక మ్యానిఫెస్టో
-వక్ఫ్‌ భూములు కాపాడుకునేందుకు వక్ఫ్‌ బోర్డుకు జ్యుడీషియరీ ఆధికారం
-ముస్లిం కార్పొరేషన్‌కు నిధులు కేటాయింపు.
-ముస్లింలపై పెట్టిన అక్రమ కేసులు మాఫీ
-రంజాన్‌ తోఫా
-దుల్హన్‌
-నిలిచిపోయిన హజ్‌ హౌస్‌ల నిర్మాణాల పూర్తి
-మైనార్టీ బాలికలకు ప్రత్యేక కళాశాలలు

చేనేత సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలు:
-మగ్గం ఉన్న చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌.
-మరమగ్గాలున్న వారికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్‌.
-ముడిసరుకు కొనుగోలుకు రాయితీలతోపాటు రుణాలు
-చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు. అవసరమైతే రాష్ట్రప్రభుత్వమే భరించేలా చేస్తాం.
-జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కామన్‌ వర్కింగ్‌ షెడ్ల నిర్మాణం
-ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం.

శెట్టిబలిజ/గౌడ/ఈడిగ సామాజికవర్గానికి హామీలు:
-శెట్టిబలజలకు గుర్తుంపు తీసుకొచ్చిన దొమ్మేటి వెంకటరెడ్డి మ్యూజియం ఏర్పాటు.
-మద్యంషాపుల్లో 20శాతం గీత కార్మికులకు కేటాయిస్తాం.
-గుర్తింపు కార్డులు కూడా మంజూరు చేస్తాం.
-చంద్రన్నబీమా రూ.5 లక్షల పరిహారం…రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి రూ.10 లక్షలకు పెంపు.
-కార్పొరేషన్‌ ద్వారా రుణాలు అందించి నీరా కేఫ్‌ లు ఏర్పాటు చేయిస్తాం.
-శాశ్వత కులదృవ పత్రాలు అందిస్తాం.
-దామాషా ప్రకారం శెట్టిబలిజ కార్పొరేషన్‌ కు నిధులు కేటాయిస్తాం.
-ఉపాధిహామీ అనుసంధానంతో కల్లుచెట్ల పెంపకానికి ప్రోత్సాహం
-నీరా కేఫ్‌ ఏర్పాటు
-ఆదరణ ద్వారా పనిముట్లు

కురుబ/మాదాసి కురబ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలు:
-రాష్ట్ర పండుగలా కనకదాసు జయంతి
-సబ్సిడీపై గొర్రెలు, ఆవులు అందజేసి, ఇన్సూరెన్స్‌ సౌకర్యం.
-22 గొర్రెలు యూనిట్‌ గా తీసుకుని సబ్సీడీలో అందిస్తాం.
-ఖాళీగా ఉన్న బంజరు భూములను గొర్రెలు మేపుకునేందుకు అప్పగిస్తాం.
-మాదాసి కురుబలకు ఎస్సీ సర్టిఫికేట్‌ మంజూరు చేసేలా చర్యలు
-ప్రభుత్వ నిధులతో బీరప్ప దేవాలయ నిర్మాణం
-బీరప్ప దేవాలయంలో అర్చకులకు జీతాలు అందిస్తాం.

బుడగ/బేడ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలు:
-అధికారంలోకి వచ్చిన పదిరోజుల్లో ఎస్సీ సర్టిఫికేట్‌
-అన్ని రకాల సంక్షేమ పథకాల అందజేత
-దామాషా ప్రకారం నిధుల కేటాయింపు

షట్ర సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలు:
-షట్ర కులస్థులకు దామాషా ప్రకారం కార్పొరేషన్‌ ఏర్పాటుతో నిధుల కేటాయింపు(కదిరి)
-కదిరిలో షట్ర కులస్థులకు యేడాదిలో భవన నిర్మాణం.
-దామాషా ప్రకారం నిధులు కేటాయింపు

ఉప్పర/సగర సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలు:
-దామాషా ప్రకారం నిధుల కేటాయింపు
-ఉప్పరసోది, ఉప్పర మీటింగ్‌ అంటూ మనోభావాలు దెబ్బతినే మాటలు నిషేధం

వక్కలిగ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలు:
-వక్కలిగలను ఓబీసీలో చేర్చే అంశంపై అధిష్టానంతో చర్చించి నిర్ణయం
-దామాషా ప్రకారం నిధులు కేటాయింపు
వాల్మీకి/బోయ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలు:
-సత్యపాల్‌ కమిటీ నివేదిక ఆధారంగా ఎస్టీల్లో చేర్చే అంశం.
-దామాషా ప్రకారం నిధుల కేటాయింపు
-పెండిరగులో ఉన్న కమ్యూనిటీ భవనాల నిర్మాణం

మత్య్సకార సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలు:
-మత్స్యకారుల పొట్ట కొడుతూ జగన్‌ తెచ్చిన జిఓ 217 టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దు చేస్తాం. చెరువులు తిరిగి మత్స్యకారులకు అందిస్తాం.
-టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వేట నిషేధం సమయంలో అందరికీ ఆర్థిక సాయం అందిస్తాం.
-టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కెమికల్‌, ఫార్మా కంపెనీల వ్యర్ధాలు సముద్రంలో కలవకుండా పొల్యూషన్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లు ఏర్పాటు చేస్తాం.
-టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఎలా అయితే బోట్లు, ఇంజిన్‌, వలలు, జీపీఎస్‌, ఐస్‌ బాక్సులు ఎలా అయితే ఇచ్చామో…తిరిగి సబ్సిడీ లో అందిస్తాం.
-మత్స్యకారుల పిల్లల చదువుల కోసం కాకినాడ ప్రాంతంలో 3 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది టిడిపి. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరో 5 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తాం.
-టీడీపీి అధికారంలోకి వచ్చిన వెంటనే బొట్లకు ఇన్స్యూరెన్స్‌ అందిస్తాం.

ఆర్యవైశ్య సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలు:
-అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి రోశయ్య చేసిన సేవలకు గుర్తుగా మ్యూజియం ఏర్పాటు
-ఆర్యవైశ్యులకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం.
-ఆర్యవైశ్య మహాసభను ప్రక్షాళన
-స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపారాలు చేసుకునేలా చర్యలు
-ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానం రూపకల్పన
-కాస్ట్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ తగ్గింపు
-జీఎస్టీ పోర్టల్‌ సమస్య పరిష్కారం

బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలు:
-దామాషా ప్రకారం బ్రాహ్మణ కార్పొరేషన్‌కు నిధులు కేటాయింపు
-బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా అపరకర్మల భవనాల నిర్మాణం.
-బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా గ్రామాల్లోని అర్చకులకు వేతనాలు
-వేదపాఠశాలల్లో విద్యనభ్యసించి సర్టిఫికేట్లు ఉన్నవారికి నిరుద్యోగ భృతి
-దీపదూప నైవేద్యాలకు, గుడి నిర్వహణ ఖర్చులకు రాష్ట్ర బడ్జెట్‌ నుంచి నిధులు కేటాయింపు
– పురోహితులకు ప్రభుత్వం నుంచి గౌరవవేతనం ఇచ్చే క్రమంలో ఐడీ కార్డులు జారీ.
-ఐడీ కార్డులు ఉన్న ప్రతి పురోహితుడికి, వారి కుటుంబానికి తిరుమలలో దర్శనం ఏర్పాటు.
-దేవాలయాల నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్‌ నుండి నిధులు కేటాయింపు.

అగ్రికుల క్షత్రియులకు ఇచ్చిన హామీలు:
-మేం అధికారంలోకి వచ్చాక మత్స్యకారులకు జగన్‌ రద్దు చేసిన పథకాలను పునరుద్ధరిస్తాం.
-అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ కు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తాం.
-బీసీలు, మత్స్యకారులకు స్వయం ఉపాధి కల్పించేందుకు మెరుగైన పనిముట్లు అందజేస్తాం.
-అవసరమైన చోట మత్స్యకారులకు రెసిడెన్షియల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తాం.
-మత్స్యకారులతో పరిశ్రమలు, చిన్నతరహా పరిశ్రమలకు 30శాతం సబ్సిడీ ఇవ్వాలనే ఉద్దేశంతో గతంలో మేం తెచ్చిన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నాం. అధికారంలోకి వచ్చాక దీన్ని అమలు చేస్తాం.
-మేం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లో 2026 కల్లా ఫిషింగ్‌ హార్బర్‌ ను కట్టే బాధ్యతను మేం తీసుకుంటాం.
-ఆలయ ట్రస్టుబోర్డుల్లో జరుగుతున్న అవకతవకలను సరిచేస్తాం.

బీసీలకు ఇచ్చిన హామీలు
-బీసీల రక్షణకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తరహాలో బీసీ అట్రాసిటీ చట్టం
-కోర్టుల్లో న్యాయ పోరాటం చేసేందుకు ఖర్చు ప్రభుత్వమే భరించేలా చర్యలు
-కార్పొరేషన్‌ ద్వారా గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు పునరుద్ధరణ.
-బీసీలపై పెట్టిన అక్రమ కేసుల మాఫీ
-ఆదరణ ద్వారా బీసీలకు పనిముట్ల పంపిణీ
-ముందుగా జిల్లా, తర్వాత నియోజకవర్గ స్థాయిలో బీసీ భవనాల నిర్మాణం
-జగన్‌ రెడ్డి తగ్గించిన స్థానిక సంస్థల రిజర్వేషన్‌ 34కు పెంపు
-175 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్‌ క్లస్టర్‌ ద్వారా బీసీలకు భూముల కేటాయింపు

మామిడి రైతులకు ఇచ్చిన హామీలు:
-రాష్ట్రంలో అధునాతన మామిడి రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి కొత్త మామిడి రకాలు అభివృద్ది చేస్తాం.
-టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పల్పింగ్‌ యూనిట్లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తాం.
-నూజివీడు ప్రాంతంలో ఉన్న రీసెర్చ్‌ సెంటర్‌ను బలోపేతం చేస్తాం.
-మామిడి అమ్మకానికి మార్కెట్‌ లింక్‌ చేస్తాం. పెద్ద సంస్థలతో డైరెక్ట్‌ గా ఒప్పందం చేసుకొని రైతుకి లబ్ధి జరిగేలా చూస్తాం.
-పక్క రాష్ట్రాల్లో అమలవుతున్న మంచి విధానాలు అధ్యయనం చేసి ఇక్కడ కూడా మామిడి పంటకు బీమా అమలు చేస్తాం.
-నూజివీడు, తిరువూరు, మైలవరం మామిడి రైతులకు లాభం వచ్చేలా స్థానికంగా మార్కెట్‌, కోల్డ్‌ స్టోరేజ్‌, రైపినింగ్‌ ఛాంబర్స్‌ ఏర్పాటు చేస్తాం.
-టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రిప్‌ ఇరిగేషన్‌ అందిస్తాం. రైతు రథాలు, సూక్ష్మ పోషకాలు, ఇతర పనిముట్లు సబ్సిడీ లో అందజేస్తాం.
-మామిడి బోర్డు ఏర్పాటు పై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
-మామిడి ఉత్పత్తుల ఎక్స్‌ పోర్ట్‌ కోసం అవసరమైన డ్రైయర్లు సబ్సిడీ లో అందిస్తాం.
-జ్యూస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేస్తాం

యువత/విద్యార్థులు :
-టీడీపీ వచ్చాక విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం
-కెరియర్‌ కౌన్సిలింగ్‌ వ్యవస్థ ఏర్పాటు
-ఏటా జనవరిలో జాబ్‌ కేలండర్‌.
-ప్రతియేటా డీఎస్సీ.
-జాబ్‌ మేళాలు నిర్వహించి ప్రైవేటు ఉద్యోగాలు
-యువతకు ప్రత్యేక మ్యానిఫెస్టో.
-జీవోనెం.77 రద్దు, పాత ఫీజు రీఎంబర్స్‌ మెంట్‌ విధానం.
-ఓటీఎస్‌ ద్వారా విద్యార్థులకు సర్టిఫికెట్ల అందజేత.
-చంద్రన్న బీమా రూ.10 లక్షలకు పెంపు.
-యువతకు ప్రత్యేక మ్యానిఫెస్టో
-టీడీపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రాష్ట్రానికి పెద్ద ప్రైవేట్‌ కంపెనీలు.
-స్వయం ఉపాధి కోసం నియోజకవర్గం స్థాయిలో ట్రైనింగ్‌ సెంటర్ల ఏర్పాటు. సబ్సిడీ రుణాల అందజేత.
-కేజీ టూ పీజీ విద్యార్థులకు ఉచిత బస్‌ పాస్‌ సౌకర్యం.
-విదేశీ విద్య పునరుద్ధరణ.
-కేజీ టు పీజీ విద్యలో సిలబస్‌ సమూల మార్పులు.
-వసతి దీవెన, విద్యాదీవెన రద్దుచేసి విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ ను నేరుగా కాలేజీలకు ఫీజులు చేల్లింపు
వ్యాపారులు/లాయర్లు
-ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌ రద్దు
-రైస్‌ మిల్లర్లు చెల్లించే సర్‌ ఛార్జీల్లో పాత విధానాన్ని తీసుకొస్తాం.
-ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ రద్దు

మహిళలు:
-మహిళలను గౌరవించేలా ప్రత్యేక పాఠ్యాంశాలు.
-మహిళల రక్షణకు ఈశాన్య రాష్ట్రాల తరహాలో ప్రత్యేక విధానాలు.
-మహిళలను పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దేలా ప్రోత్సాహకాలు.
-అభయ హస్తం పథకం పునరుద్దరణ.
పాదయాత్రలో ప్రజలకుఇచ్చిన ఇతర హామీలు
-డీకేటీ పట్టాల విషయంలో కర్ణాటక విధానాలు అమలు.
-కార్పెంటర్లకు అవసరమైన విధంగా షెడ్ల నిర్మాణం
-ఆటో యూనియన్‌ బోర్డు ఏర్పాటు. సౌకర్యాలతో ఆటో స్టాండ్ల ఏర్పాటు
-చంద్రన్న బీమా పున:రుద్ధరణ.
-అన్న క్యాంటీన్‌ పునరుద్ధరణ
-పెట్రోల్‌, డీజల్‌ ధరలు తగ్గించి నిత్యవసర సరుకుల ధరలు తగ్గింపు
-షరతులు లేకుండా ఫించన్లు, రేషన్‌ కార్డులు మంజూరు.
-ఆధార్‌, రేషన్‌ కార్డుల కోసం అధికారుల చుట్టూ తిరగకుండా మొబైల్‌ కు వచ్చేలా ఏర్పాట్లు

బైక్‌ మెకానిక్‌లకు నారా లోకేష్‌ హామీలు:
-అనేక కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. బీస్‌ 5, బిఎస్‌ 6, ఎలెక్ట్రిక్‌ వాహనాలు వస్తున్నాయి. దానికి అనుగుణంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లా లేదా పార్లమెంట్‌ను యూనిట్‌గా తీసుకొని బైక్‌ రిపేర్‌ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.
-టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అధునాతన పనిముట్లు అంది స్తాం. మెకానిక్‌ షెడ్లు ఏర్పాటు చేసుకోవడానికి కార్పొరేషన్లు ద్వారా సబ్సిడీ రుణాలు అందిస్తాం.
-టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బైక్‌ మెకానిక్స్‌ను గుర్తిస్తాం. బైక్‌ మెకానిక్స్‌కు ప్రభుత్వ గుర్తింపు కార్డులు అందజేస్తాం. వైద్య సాయం, చంద్రన్న భీమా బైక్‌ మెకానిక్స్‌కు అమలు చేస్తాం.
-మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా బైక్‌ మెకానిక్స్‌కు నైపుణ్య శిక్షణ ఇస్తాం.
-టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బైక్‌ మెకానిక్స్‌ ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటాం.
-బైక్‌ మెకానిక్స్‌ సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసే అంశం పై పార్టీ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం.

రిటైర్డు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు
-రిటైర్డ్‌ ఉద్యోగాలకు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ పెంపుదల.
-రిటైర్డ్‌ ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఇతర బెనిఫిట్స్‌ సకాలంలో అందజేత.
-రిటైర్డ్‌ ఉద్యోగులకు సొంత ఇల్లు నిర్మాణానికి సహకారం.
-ఆరోగ్యపరమైన సేవల కోసం పూర్తి రీఎంబర్స్‌ మెంట్‌ తో హెల్త్‌ కార్డులు.
పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన ఇతర హామీలు:
-డీకేటీ పట్టాల విషయంలో కర్ణాటక విధానాలు అమలు.
-కార్పెంటర్లకు అవసరమైన విధంగా షెడ్ల నిర్మాణం
-ఆటో యూనియన్‌ బోర్డు ఏర్పాటు
-సౌకర్యాలతో ఆటో స్టాండ్ల ఏర్పాటు
-చంద్రన్న బీమా పునరుద్ధరణ, బీమా మొత్తం రూ.10 లక్షలకు పెంపు.
-అన్న క్యాంటీన్‌ పునరుద్ధరణ
-పెట్రోల్‌, డీజల్‌ ధరలు తగ్గించి నిత్యవసర సరుకుల ధరలు తగ్గింపు
-షరతులు లేకుండా పేదలందరికీ పింఛన్లు, రేషన్‌ కార్డులు మంజూరు.
-అధికారుల చుట్టూ తిరగకుండా మొబైల్‌కు కార్డులు వచ్చేలా ఏర్పాట్లు.