– టీడీపీ దర్శి ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి
దర్శి, మహానాడు: ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా దర్శి పట్టణంలో 10వ వార్డులో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ పథకాలు అమలు తీరు, ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వివరించారు. ఈ సందర్భంగా ప్రజల బాగోగులను అవసరమైన సమస్యలను, పనులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ… 100 రోజుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, యువ నాయకులు యువతకు స్ఫూర్తి ప్రదాత, మంత్రి నారా లోకేష్, జిల్లా మంత్రి బాల వీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి సారథ్యంలో ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలను చేపట్టాం… ప్రజల కోసం ప్రభుత్వం నిరంతరం పనిచేస్తున్న విషయం అందరికీ తెలుసు.. ఇటీవల తుపాను బీభత్సంలో ప్రజల కోసం ముఖ్యమంత్రి ఎలా పరితపించారో రాష్ట్రం వ్యాప్తంగా చూశారన్నారు. ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకున్నారు… వరద బాధితుల కష్టాలు తీర్చారన్నారు.
వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించింది.. అయినా ఆర్థిక సంక్షోభంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో ఒకటో తారీకు ఇంటి వద్ద పెన్షన్ల పంపిణీ, ఉద్యోగులకు జీతాలు, అమరావతి రాజధాని పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి, రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రోడ్ల నిర్మాణానికి కసరత్తు, ఇసుక, మద్యం, మైనింగ్ ఇలా సంక్షేమ కార్యక్రమాలు పడుతున్నారు. పేదవానికి మూడు సెంట్లు ఇంటి స్థలానికై ఏర్పాట్లు, ల్యాండ్ టైట్లింగ్ యాక్టర్ రద్దు ఇలా… వంద రోజుల్లో 100 అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని లక్ష్మి తెలిపారు.
ఐదేళ్ళ వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో కూర్చుని పాలన చేస్తూ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి లడ్డులో కూడా అపచారం చేశారంటే గత పాలకులు ప్రజలను ఎలా మోసం చేశారో అర్థం చేసుకోవాలన్నారు. ఇక వైసీపీ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని, అందుకు చర్చలు జరుగుతున్నాయాని చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రజా ప్రభుత్వాన్ని ఆదరించండి రాజకీయాల కోసం వివాదాలు సృష్టించవద్దు… ప్రజా సంక్షేమ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్ఫూర్తితో దర్శి ప్రాంతాన్ని, ముఖ్యంగా దర్శి పట్టణాన్ని అభివృద్ధి వైపు నడిపిద్దాం… అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేద్దాం… ఇదే నా లక్ష్యం, నా గమ్యం… అభివృద్దే నా సమాధానం. కులాలు, మతాలు ఘర్షణలు లేని అభివృద్ధి దర్శిగా మారుద్దామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, 10వ వార్డ్ కౌన్సిలర్ పసుపులేటి శేషమ్మ, దత్తాత్రేయ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.