– తల్లి,బిడ్డ ఇద్దరూ సురక్షితం
బిచ్కుంద: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని తక్కడ్ పల్లి గ్రామానికి చెందిన గర్భిణీ అశ్విని బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రి నుండి 108 అంబులెన్స్ లో బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో అంబులెన్స్ లో ప్రసవించింది. ఈ సందర్భంగా అంబులెన్స్ సిబ్బంది మాట్లాడుతూ తల్లి,బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. అనంతరం బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లామన్నారు. ఇందులో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అనిల్, అంబులెన్స్ డ్రైవర్ కాశీనాథ్, అంగన్వాడి టీచర్ తదితరులు ఉన్నారు.