- ఇటీవలి బాబు,లోకేష్ ఢిల్లీ పర్యటన ఆంతర్యం అదేనా?
- ఏపీకి మాత్రమే ఇస్తే రాజకీయం దుమారం
- అందుకే మిగిలిన రాష్ట్రాలకూ 12 పార్కులు
- ఈ వారం ప్రారంభం లోనే ఆమోదం?
- బిజినెస్ స్టాండర్డ్ పత్రిక నివేదిక
ఢిల్లీ: బిజినెస్ స్టాండర్డ్ పత్రిక అదిరేటి కబురు అందించింది. కేంద్ర మంత్రివర్గం బీహార్, ఆంధ్ర, పంజాబ్లో 12 పారిశ్రామిక పార్కుల కోసం రూ. 25,000 కోట్ల ప్యాకేజీని ఆమోదించనున్నదని పేర్కొంది. కేంద్ర మంత్రివర్గం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, కేరళ , ఇతర ప్రాంతాల్లో పెట్టనున్న కొత్త పారిశ్రామిక పార్కులకు ఆమోదం తెలపనున్నది.
ఈ ఆమోదం ఈ రాష్ట్రాల్లో పారిశ్రామిక వృద్ధి – ఆర్థిక అభివృద్ధిని గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు. సుమారు రూ. 25,000 కోట్ల ఖర్చు చేయడానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదించనున్నదని బిజినెస్ స్టాండర్డ్ నివేదిక పేర్కొంది.
ఈ కార్యక్రమాలు రూ. 1.5 ట్రిలియన్ పెట్టుబడులను ఆకర్షించగలవని నివేదిక పేర్కొంది. ఈ ప్రణాళికలో భాగంగా గృహ మరియు వాణిజ్య ప్రాంతాలతో కూడిన సగటు పారిశ్రామిక నగరాలు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, దేశీయ తయారీని పెంచడం, మరియు ఉపాధిని సృష్టించడం కోసం ప్రభుత్వానికి అనుకూలమైన వ్యూహంగా పేర్కొంది.
ఈ వారం ప్రారంభం లోనే ఆమోదం జరగవచ్చని భావిస్తున్నారు. గత నెలలో బడ్జెట్ ప్రసంగంలో కేంద్రమంత్రివర్గం నిర్మల సీతారామన్ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో ఈ పార్కులను చేర్చడానికి చేసిన ప్రకటన తదుపరి చర్యలో భాగంగా ఈ ఆమోదం అని భావిస్తున్నారు.
ఇటీవలే చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు ఢిల్లీలో నిర్మల సీతారామన్, మోడీ, అమిత్ షా తదితరులను కలిసి వచ్చారు. తదుపరి లోకేశ్ కూడా కలిసి వచ్చారు. ప్రత్యేకంగా ఆంధ్రాకు మాత్రమే ఆమోదం తెలిపితే రాజకీయ దుమారం రేగుతుందని ఒకే సారి 12 పార్కులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు భావిస్తున్నారు.