కాంగ్రెస్‌కు 12 నుంచి 14 స్థానాలు

డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క

భూపాలపల్లి, మహానాడు : భూపాలపల్లి జిల్లా మంథని మండలంలో మంత్రి దుద్దిళ్ల స్వగ్రామమైన ధన్వాడలో వివిధ దేవాలయాల వార్షికోత్సవాలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరై పూజలు నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో 12 నుంచి 14 స్థానాలు కాంగ్రెస్‌ గెలుచుకోబోతోందని తెలిపారు. సమావే శంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌రావు, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్‌రావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్‌ సింగ్‌, భూపాలపల్లి ఎమ్మెల్యే గంటల సత్యనారాయణ పాల్గొన్నారు.