Mahanaadu-Logo-PNG-Large

రాష్ట్రంలో కూటమికి 160 సీట్లు

ఐప్యాక్‌ ప్యాకప్‌…జగన్‌ దింపుడు కళ్లెం ఆశలు
ఎన్నికల కమిషన్‌కు అధికారుల జాబితా ఇస్తాం
అవినీతిపై విచారించి చర్యలు తీసుకుంటాం
బీజేపీ మీడియా ఇన్‌చార్జ్‌ పాతూరి నాగభూషణం

విజయవాడ, మహానాడు : ఐ ప్యాక్‌ టీం సమావేశంలో 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్లు వస్తాయని జగన్‌ చెప్పు కుంటున్నారని, దీనినే దింపుడు కళ్లెం ఆశలు అంటారని బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్‌చార్జ్‌ పాతూరి నాగభూషణం అన్నారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన పోలింగ్‌ శాతం చూస్తే కూటమిపై ప్రజల స్పందన అర్థమవుతుంది. ఇప్పటికే ఐప్యాక్‌ టీం ప్యాకప్‌ అయిపోయి వెళ్లిపోయా రు. పేపర్లో వార్తలు వచ్చాక తప్పదనే ఈరోజు జగన్‌ సమావేశం పెట్టారు. గత ఎన్నికల లో ఇచ్చిన సందేశానికి, ఇప్పుడు జగన్‌ ఇచ్చిన సందేశానికి పోలికే లేదన్నారు. వైసీపీ ఓటమి ఖాయమైందని వ్యాఖ్యానించారు. ఇసుక తవ్వకాలు ఏపీలో యథేచ్ఛగా జరుగుతున్నాయి. దీనిపై కలెక్టర్లు అసత్యాలతో నివేదికలు ఇచ్చారు. సీఎస్‌ జవహర్‌ రెడ్డి కూడా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. పెన్షన్ల విషయంలోనే సీఎస్‌ వ్యవహార శైలి అనేక అనుమానాలకు తావిచ్చింది. వివిధ పథకాల కింద నిధులు పోలింగ్‌ కు ముందు ఇస్తానని జగన్‌ హడావిడి చేశారు. ఇప్పుడు ఎక్కడకి వెళ్లాయో సీఎస్‌ సమాధానం చెప్పాలని కోరారు.

ఎన్నికల కమిషన్‌కు అధికారుల జాబితా

ఆళ్లగడ్డ, తిరుపతి, ఇతర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లు కూడా వైసీపీ ఓటమిని తెలియజేస్తు న్నాయి. పోలీసులు ముందు చూపుతో వ్యవహరించలేదు. వివిధ ఆరోపణల్లో ఉన్న అధికారులను తప్పించాలని మేము కోరితే వారిని ప్రాధాన్యం ఉన్న పోస్టుల్లో వేశారు. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న అధికారుల జాబితాను ఎన్నికల సంఘానికి అందిస్తున్నాం. స్ట్రాంగ్‌ రూమ్‌కు సమీపంలో పార్టీలు పెడితే ఎలా అనుమతి ఇచ్చారో చెప్పాలి. కేంద్రంలో 400 సీట్లు, ఏపీలో ఎన్డీఏ కూటమి 160 సీట్లతో అధికారంలోకి రావడం ఖాయం. మరో 20 రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.

అవినీతిపై చర్యలు తీసుకుంటాం

ఎన్నికల సంఘానికి కూటమి పార్టీల తరపునే లేఖలు రాసి వాస్తవ పరిస్థితి వివరించాం. పురందేశ్వరి, ఇతర పార్టీలు రాసినా కూటమి కిందే పరిగణించాలి. చిలకలూరిపేటలో మోదీ సభలో భద్రతా వైఫల్యం నిజం కాదా? వాటిని వివరిస్తూ మా అధ్యక్షురాలు లేఖలు రాస్తే తప్పేముంది. విజయవాడలో నిర్వహించిన ర్యాలీలో భద్రత కట్టుదిట్టం చేశారు కదా? ఎన్నికల అబ్జర్వర్స్‌ వారి పని వారు చేస్తూ నివేదికలు ఇస్తారు. వైసీపీ నేతలకు ఓటమి ఖాయంగా తేలిపోయింది. అందుకే ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. ఏపీలో అధికారులు, పోలీసులు తమ మాట వినడం లేదని పేర్ని నాని, అంబటి రాంబాబు ఇప్పుడు అంటున్నారు. మరి ఇదే నాని గతంలో ఎస్పీ ఎవడు.. నాక న్నా తక్కువ అంటూ రంకెలు వేయలేదా? అంబటి రాంబాబు, అనిల్‌కుమార్‌, అప్పిరెడ్డి వంటి వారు నోరు పారేసుకోలేదా? పోలింగ్‌ అనంతరం పోలీసులు, టీడీపీ నేతలపై దాడి చేసి తలలు పగులకొట్టింది వైసీపీ నేతలు కాదా? వైసీపీ ప్రభుత్వంలో అవినీతి భారీగా జరిగింది. దీనిపై విచారణ ఉంటుంది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిపరులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.