Mahanaadu-Logo-PNG-Large

18 వేల టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం

కాకినాడ, మహానాడు :  కాకినాడ పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ బృందాలు పలు గోదాముల్లో తనిఖీలు చేపట్టారు. రెండు గోదాముల్లో రూ.52.39 కోట్ల విలువైన 18,526 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లోటస్ మెరైన్ లాజిస్టిక్స్ లో రూ.25.18 కోట్ల విలువైన 8,280 టన్నులు, కాంక్వైర్ గోదాములో రూ.28.21 కోట్ల విలువైన 9,246 టన్నుల బియ్యం స్వాదీనం చేసుకున్నారు. సోమవారం వరకు స్వాధీనం చేసుకున్న రూ.43.43 కోట్ల విలు వైన 15,396 టన్నుల రేషన్ బియ్యానికి ఈ సరుకు అదనంగా గుర్తించారు. గోదాముల్లో దాడులు నిరం తరాయంగా కొనసాగుతాయి. పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు.