– బాబు ఐదు సంతకాలకు క్యాబినెట్ ఓకే
అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు చేసిన ఐదు సంతకాలకు కేబినెట్ ఆమోదించింది. మెగా డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.మెగా డీఎస్సీలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆమోదం పొందిన మిగతా నిర్ణయాల్లో.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పెంపు, స్కిల్ సెన్సెస్ ఉన్నాయి. 183 అన్న క్యాంటీన్లను ఆగస్టు నెలలో ఒకే రోజున ఒకేసారి ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది.