బాపట్లలో 20 మంది విద్యార్థునులకు అస్వస్థత

బాపట్ల: కాఫీ పొడిలో నిమ్మకాయ కలిపిన మిశ్రమాన్ని తాగిన 20 మంది విద్యార్థునులు అస్వస్థతకు గురయ్యారు. బాపట్లలో ఓ పాఠశాలలో ఆరో తరగతి చదివే విద్యార్థిని తోటి విద్యార్థునులకు కాఫీ పొడిలో నిమ్మకాయ కలిపి ఇచ్చింది. దీంతో ఆ మిశ్రమం తాగిన 20 మంది విద్యార్థులు అస్వస్థకు గురై బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. జిల్లా డిప్యూటీ కలెక్టర్ విద్యార్థులను పరామర్శించారు.