Mahanaadu-Logo-PNG-Large

కార్గిల్ యుద్ధానికి 25 ఏళ్ళు

75 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ

గుంటూరు, మహానాడు :  కార్గిల్ యుద్ధం జరిగి 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా యువ మోర్చా అధ్యక్షులు మైలా హరికృష్ణ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా 75 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్ట వంశీకృష్ణ పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ ను గడగడలాడించిన భారత్ యుద్ధ వీరులు ఎంతోమంది అసువులు బాసారు. వారిని గుర్తు చేసుకుంటూ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించడం మన కర్తవ్యమన్నారు. ఎంతోమంది సైనికుల ప్రాణ త్యాగమే ఈ రోజున మనమందరం ఈ స్వేచ్ఛ వాయువుల్ని పీల్చుకుంటున్నాము అని కొనియాడారు.

యువ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు రోహన్ సైగల్ మాట్లాడుతూ ఆ రోజున ప్రధాని వాజ్ పేయి అయినా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ అయినా దేశం కోసం ఆవిరళంగా కృషి చేస్తున్నారన్నారు. శాంతి భద్రతల కోసం పనిచేస్తున్న సైనికులకు.. ఈ దేశంలో ఉగ్రవాదం లేకుండా నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్, జనసేన అధ్యక్షులు గాదే వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాటిబండ్ల రామకృష్ణ, బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవనీత్ కృష్ణా రెడ్డి, జిల్లా ఇంచార్జి శ్రీనాద్, జోనల్ ఇంచార్జ్ అశోక్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర పదాధికారి కొక్కెర శ్రీనివాస్ యాదవ్,బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు చరక కుమార్ గౌడ్ చెరుకూరి తిరుపతి రావు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్, టీడీపీ కార్పొరేటర్ సమత, బీజేవైఎం నాయకులు బాలకొటయ్య, గోపి, ఫణి కృష్ణ, జాబిలి శ్రీనివాస్,ఈశ్వర్ గౌడ్, తిరుపతి ప్రభుదాస్,నాగ గోపి,నాని,రాజా, బీజేపీ నాయకులు రాష్ట్ర మీడియా సెల్ కో కన్వీనర్ గంగాధర్, రాష్ట్ర నాయకులు జంధ్యాల రామలింగ శాస్త్రి,పద్మనాభం, వరికూటి వీర సుధాకర్,అప్పిశెట్టి రంగా, రామకృష్ణ, బిలాల్, కోలా రేణుక దేవి, లాలా స్వాతి, షేక్ సాంబశివరావు,లంక రవి, సురేష్ జైన్, మాదల సురేష్ తదువై రామ కృష్ణ దారా అంబేద్కర్, జితేంద్ర గుప్త తదితరులు పాల్గొన్నారు