390 సెల్‌ ఫోన్ల రికవరీ, అప్పగింత

– ఎస్పీ గంగాధరరావు

విజయవాడ, మహానాడు: కృష్ణా జిల్లా వ్యాప్తంగా చోరీకి గురైన లక్షలాది రూపాయల విలువ చేసే 390 సెల్‌ ఫోన్లను సీసీఎస్‌ పోలీసులు రికవరీ చేశారు. సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా సంబంధిత వినియోగదారులకు వాటిని అప్పగించారు. వీటి విలువ అక్షరాల రూ. 40 లక్షలు. గుడివాడకు చెందిన 202 మంది, మచిలీపట్నానికి చెందిన 96 మంది, పెనమలూరుకు చెందిన 90 మంది ఫిర్యాదుదారులకు ఫోన్లను అప్పగించామని ఎస్పీ గంగాధరరావు తెలిపారు.