విజయవాడ, మహానాడు: ఆరు హెలికాప్టర్ల ద్వారా పులిహోర, బిస్కెట్లు, మందులు, వాటర్ బాటిళ్లు, సాఫ్ట్ డ్రింక్స్ ను ఎన్ డిఆర్ ఎఫ్ బృందాలు వరద బాధితులకు పంపిణీ చేస్తున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రి లోకేష్ వరద సహాయ చర్యలపై నిరంతర సమీక్షిస్తున్నారు. వరదముంపునకు గురైన సింగ్ నగర్, జక్కంపూడి, కండ్రిగ, అజిత్ సింగ్ నగర్, డాబా కోట్ల సెంటర్, లూనా సెంటర్ ప్రాంతాల్లోని అపార్ట్ మెంట్లలో నివసిస్తున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహార పొట్లాల పంపిణీ చేస్తున్నారు.
టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070 లకు వస్తున్న విన్నపాలపై ఎప్పటికప్పుడు స్పందించేలా ఏర్పాట్లు చేశారు. ఐవీఆర్ఎస్ ద్వారా వరద బాధిత ప్రాంతాల ప్రజల నుంచి సహాయ చర్యలను యంత్రాంగం తెలుసుకుంటోంది. ముంపు ప్రాంతాల్లో 3.9 లక్షల ఆహార పొట్లాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు.
శాంతించిన కృష్ణమ్మ
కృష్ణమ్మ వరద తగ్గుముఖం పట్టింది. ప్రకాశం బ్యారేజి వద్ద 11.41లక్షల క్యూసెక్కుల నుంచి 11.33 లక్షల క్యూసెక్కులకు వరద ప్రవాహం తగ్గింది. కాగా, జగన్ ప్రభుత్వ నిర్వాకం కారణంగా కృష్ణలంక పరిసరాలు మునిగిపోయాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ ఉన్న శ్మశానం ప్రాంతంలో రిటైనింగ్ వాల్ కట్టకుండా గత ప్రభుత్వం విడిచిపెట్టిందంటున్నారు.