నెల్లూరు జైల్లో రెండోరోజు పిన్నెల్లికి 65 ప్రశ్నలు

మాచర్ల, మహానాడు:  సీఐపై దాడి కేసులో అరెస్టై నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం రెండోరోజు విచారించారు. కారంపూడి దాడిపై పోలీసులు 65 ప్రశ్నలు సంధించగా పిన్నెల్లి పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. పోలింగ్ తర్వాత రోజు ఇంటి నుంచి బయటకి వెళ్లలేదు. కారంపూడి ఎలా వెళ్తా? సీఐపై దాడి ఎలా చేస్తా? ‘ఆ ఘటనతో తనకు సంబంధం లేదంటూ బదులిచ్చినట్లు తెలుస్తోంది.