అమరావతి, మహానాడు: ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. అధిక వర్షాలకు వరి దెబ్బ తిన్న జిల్లాల్లో 80 శాతం రాయితీతో వరి విత్తనాలు సరఫరా చేయనున్నట్లు పేర్కొంది. ఉభయ గోదావరి, ఏలూరు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో 6,356 క్వింటాళ్ల విత్తనాలను రైతు సేవా కేంద్రాల వద్ద పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ఈ ప్రాంతాల్లో గత నెల భారీ వర్షాలకు 1,406 హెక్టార్లలో నారు మడులు, 33 వేల హెక్టార్లలో వరి పంట నాశనమైందని అన్నారు.