తొలి రెండు స్థానాల్లో తెలుగు వాళ్లే
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ వెల్లడి
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల్లో 93 శాతం మంది కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్’ (ఏడీఆర్) తెలిపింది. గత ఎంపీల్లో 475 మంది మిలియనీర్లు ఉండగా ఈసారి 504కు పెరిగిందని వెల్లడిరచింది. ధనిక ఎంపీల్లో గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రూ.5,705 కోట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. చేవెళ్ల బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డి రూ. 4,568 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారని తెలిపింది.