వైసీపీ నేతల ఇసుక దోపిడీకి కొందరు కలెక్టర్ల సహకారం

• ఏపీలోని ఇసుక తవ్వకాలపై కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన నివేదికపై జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతాడు?
• ప్రజల సొమ్ము, ప్రకృతి సంపద దోచేసేవారికి సహకరిస్తున్న వారు కూడా శిక్షార్హులే. టీడీపీప్రభుత్వం రాగానే తప్పుచేసిన కలెక్టర్లపై చర్యలు తీసుకుంటుంది.
• అవసరమైతే దోచేసిన ఇసుకకు లెక్కకట్టి, ఆ సొమ్ముని వారి నుంచే రాబడుతుంది.
• ఈనాడు విలేకరికి కనిపించిన ఇసుక అక్రమ మైనింగ్ పల్నాడుజిల్లా కలెక్టర్ కు ఎందుకు కనిపించలేదు?
• టీడీపీ ప్రభుత్వం రాగానే మైనింగ్ శాఖ ఎండీ వెంకటరెడ్డిని కఠినంగా శిక్షిస్తుంది. అధికారపార్టీ నేతల ఇసుక దోపిడీకి సహకరిస్తూ జగన్ రెడ్డికి అందచేయాల్సిన సొమ్ముని ఎప్పటికప్పుడు వెంకటరెడ్డే అందచేస్తున్నాడు.
• రాష్ట్రంలోజరిగే ఇసుక తవ్వకాలతో జేపీ వెంచర్స్.. ప్రతిమా సంస్థలకు ఎలాంటి సంబంధం లేకపోతే, ఆయా సంస్థలు తక్షణమే ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలి

– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు

జగన్ రెడ్డి జమానాలో ఇసుకకు ఒక ప్రత్యేక పాలసీ లేకుండా అడ్డగోలుగా దోచేస్తు న్నారని, వైసీపీనేతల ఇసుక అక్రమ మైనింగ్ పై, ఇసుకాసురుల దోపిడీపై టీడీపీ ఎన్నో ఆందోళనలు చేసిందని, ప్రజలు.. ప్రతిపక్షాలు..మీడియా.. న్యాయస్థానాలు .. ఆఖరికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ రాష్ట్రంలో జరిగే ఇసుకదోపిడీపై ఆగ్రహం వ్యక్తం చేసినా జగన్ సర్కార్ దున్నపోతుపై వాన పడిన తీరుగానే వ్యవహరించిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ జగన్ రెడ్డి అతని ప్రభుత్వం అడ్డగోలుగా సాగిస్తున్నఇసుక దోపిడీపై కేంద్ర పర్యావరణ శాఖ తాజాగా నివేదిక ఇచ్చింది. రాష్ట్రంలో అక్రమంగా ఇసుక తవ్వకం జరుగుతోందని సదరు నివేదికలో కేంద్రప్రభుత్వం తేల్చింది. సదరు నివేదికపై ముఖ్యమంత్రి , మంత్రి పెద్డిరెడ్డి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నాం.

ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానాల్లో ఎన్జీటీ ఎదుట రాష్ట్రంలో ఇసుక అక్రమ మైనింగ్ జరగడంలేదని, వైసీపీ నేతలకు సంబంధంలేదని పొంతనలేని సమాధానాలు చెప్పారు

రాష్ట్రంలో జరిగే ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రభుత్వ న్యాయవాది పలు సందర్భా ల్లో పలు రకాలుగా చెప్పుకొచ్చారు. జనవరి31-2024న రాష్ట్రంలో అసలు ఎక్కడా అక్రమ మైనింగ్ జరగడంలేదని ప్రభుత్వ న్యాయవాది గ్రీన్ ట్రైబ్యునల్ ఎదుట చెప్పారు. అదే న్యాయవాది మరలా 05-02-2024న ప్రతిమా కంపెనీకి ప్రభుత్వం ఇసుక తవ్వకాలు అప్పగించిందని, రాష్ట్రంలో ఆ కంపెనీనే ఇసుక తవ్వ కాలు సాగిస్తోందని చెప్పారు.

అదే న్యాయవాది మొన్నటికి మొన్న 14వ తేదీన ప్రభుత్వమే ఇసుక మైనింగ్ చేస్తోందని చెప్పారు. ఇలా పొంతనలేని సమాధానాల తో అటు ప్రభుత్వన్యాయవాది న్యాయస్థానాల్ని, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ని తప్పుదారి పట్టిస్తే, మరోపక్క రాష్ట్రంలోని 21 మంది ఐ.ఏ.ఎస్ అధికారులు ఎక్కడా ఇసుక అక్రమ మైనింగ్ జరగడంలేదని తేల్చిపారేశారు. వాస్తవం చెప్పా లంటే రాష్ట్రంలో నేటికీ అక్రమ ఇసుక మైనింగ్ జరుగుతూనే ఉంది.

పల్నాడు జిల్లా కలెక్టర్ ఇసుక రీచ్ ను పరిశీలించి, అక్రమ మైనింగ్ లేదని నిర్ధారించాక అదే రీచ్ కు వెళ్లిన ఈనాడు విలేకరిపై ఎందుకు దాడిచేశారు? చిలువూరు, గాజుల్లంక రీచ్ లలో జరిగే ఇసుక అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకునే ధైర్యం బాపట్ల జిల్లా కలెక్టర్ కు లేదు

వైసీపీనేతలు యథేచ్ఛగా ఇసుక అక్రమ మైనింగ్ కు పాల్పడుతుంటే కలెక్టర్లు తమకు ఏమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇటీవల పల్నాడు జిల్లా కలెక్టర్ అమరావతిలో ఒక ఇసుక రీచ్ ను పరిశీలించి, అక్కడ ఎలాంటి అక్రమ మైనింగ్ జరగడంలేదని ధృవీకరించాడు. అదే రీచ్ లోజరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహరం గుట్టుమట్లు తేల్చడానికి వెళ్లిన ఈనాడు విలేకరిపై వైసీపీ గూండాలు దాడిచేశారు. సదరు విలేకరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కొల్లూరు మండలం జువ్వలపాలెం వెళ్లి పరిశీలించి, అక్కడ ఎలాంటి అక్రమ మైనింగ్ జరగలేదని చెప్పాడు.

వాస్తవానికి జువ్వలపాలెంలో అధికారికంగా ఎలాంటి ఇసుక రీచ్ లేదు. పక్కనే చిలువూరు, గాజుల్లంక రీచ్ లలో జరిగే అక్రమ మైనింగ్ ను పరిశీలించి, చర్యలు తీసుకునే ధైర్యం బాపట్ల కలెక్టర్ కు లేదు. ఈ విధంగా వైసీపీ ప్రభుత్వ ఇసుకదోపిడీకి ఐ.ఏ.ఎస్ అధికారులు ఇష్టానుసారం సహకరిస్తున్నారు. తప్పులు చేస్తున్న అధికారులందరూ ఎప్పటికైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే.

గతంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హాయాంలో జగన్ రెడ్డి అవినీతికి సహకరించిన అధికారులు ఏమయ్యారో, ఎందరు జైళ్లకు వెళ్లారో కలెక్టర్లు ఆలోచించుకోవాలి. మైనింగ్ శాఖ ఏడీ వెంకటరెడ్డి కూడా ఇసుక అక్రమ మైనింగ్ కు తనవంతు సహాయ సహకారా లు అందిస్తున్నాడు. వైసీపీనేతల అక్రమ ఇసుక మైనింగ్ కు సహకరిస్తున్న కలెక్ట ర్లు, మైనింగ్ అధికారులు ఎప్పటికీ తప్పించుకోలేరు.

జాయింట్ కమిటీసభ్యులకు కనిపించిన ఇసుక అక్రమ మైనింగ్ కలెక్టర్లకు కనిపించకపోవడం శోచనీయం

జనవరి 17 నుంచి 19 వరకు మూడురోజుల పాటు కృష్ణా..గుంటూరు జిల్లాల్లో పర్యటించిన జాయింట్ కమిటీ అనేక రీచ్ లలో ఇసుక అక్రమ మైనింగ్ జరుగుతున్నట్టు తేల్చింది. కలెక్టర్లేమో అక్రమ మైనింగ్ లేదని చెబుతున్నారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు సంబంధించి జేపీ వెంచర్స్ వారికి ప్రభుత్వమిచ్చిన గడువు ఎప్పుడో పూర్తయినా ఇప్పటికీ కొన్నిచోట్ల ఆ సంస్థ పేరుతో వైసీపీ వాళ్లు ఇసుక దోపిడీ సాగిస్తున్నారు. రాష్ట్రంలోజరిగే ఇసుకదోపిడీ.. ఇసుక అక్రమ మైనింగ్ తో జేపీ వెంచర్స్.. ప్రతిమా సంస్థలకు ఎలాంటి సంబంధం లేకపోతే, ఆయా సంస్థల యాజమాన్యాలు తక్షణమే ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలి.

ఆ సంస్థలు స్పందించకుంటే, వైసీపీనేతల ఇసుక దోపిడీతో వాటికి సంబంధం ఉన్న ట్టే భావించాల్సి వస్తుంది. అలానే టీడీపీప్రభుత్వం రాగానే వైసీపీనేతలతో పాటు, ఆ సంస్థలపై కూడా కఠిన చర్యలు తీసుకోవడం ఖాయం. గతంలో టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఇసుక రీచ్ లను పరిశీలించి, ఎక్కడెక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందో ఆధారాలతోసహా బయటపెట్టినా, ప్రభుత్వంలో స్పందనలేదు. జగన్ రెడ్డి ఇసుక దందాకు సహకరిస్తున్న కలెక్టర్లు కచ్చితంగా శిక్షింపబడతారు.

ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడిన అధికారులు ఎలా శిక్షింపబడ్డారో తెలుసుకొని ఇప్పటికైనా మేల్కొంటే మంచిది.(కొల్లిపర రీచ్ లో నిన్న ఉదయం జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలకు సంబం ధించిన ఫోటోలతో పాటు, మల్లాది రీచ్ సహా, అనేక రీచ్ లలో తీసిన ఫోటోల్ని ఆనంద్ బాబు విలేకరులకు చూపించారు)

ఇసుక దోపీడీకి పాల్పడుతున్న వైసీపీనేతల్ని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ వారికి సహకరిస్తున్నఅధికారుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అవసరమైతే దోచేసిన సొమ్ముని అధికారుల నుంచే రాబడతాం

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు సాగిస్తున్న అక్రమ ఇసుక మైనింగ్ ను వదిలిపెట్టేదే లేదు. వారికి సహకరిస్తున్న అధికారుల్ని కూడా వదిలిపెట్టం. చిలువూరు వద్ద బుసక పేరుతో ఇసుక దోచేస్తుంటే, బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకు కనిపించ డం లేదా? జేపీ వెంచర్స్ పేరుతో ఇసుకతవ్వకాలు జరుగుతున్నాయని ఆధారా లతో సహా రంజిత్ బాషాకు చెప్పినా, ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈనాడు విలేకరి వెళ్లి ఇసుక అక్రమ మైనింగ్ ఫోటోలు తీస్తుంటే, అదే రీచ్ లో ఎలాంటి అక్రమ మైనింగ్ జరగడంలేదని పల్నాడు జిల్లా కలెక్టర్ ఎలా చెబుతారు ?

ప్రజల సంపద, ప్రకృతి సంపదను దోచుకునేవారికి సహకరిస్తున్న అధికారుల నుంచే అవసరమైతే దోపిడీ సొమ్ముని రాబడతాం. మైనింగ్ శాఖ ఎండీ వెంకట రెడ్డి భవిష్యత్ లో కచ్చితంగా జైలుకెళతాడు. ఇసుకదోపిడీలో ముఖ్యమంత్రికి అందాల్సిన సొమ్ము ఎప్పటికప్పుడు ఆయనకు అందుతోంది. రాష్ట్రంలో సాగుతున్న ఇసుక తవ్వకాలకు గ్రీన్ ట్రైబ్యునల్, కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు లేనే లేవు.” అని ఆనంద్ బాబు తేల్చిచెప్పారు