రాష్ట్రానికి ధ‌ర‌ణి గుది బండ‌

జాబ్ క్యాలెండ‌ర్ కు నిధులు విడుద‌ల
గ‌త బకాయిలను ఆర్ధిక శాఖ‌లో క్లియ‌రెన్స్
పాత బ‌స్తీలో మూడు ఫ్లై ఓవ‌ర్‌ల నిర్మాణం
563 గ్రూప్-1 ఉద్యోగాల కోసం నోటిఫికేష‌న్

– అసెంబ్లీలో బ‌డ్జెట్‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పిన డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌

ప్ర‌జ‌ల‌పై ప‌న్నుల భారం వేయకుండానే ప్ర‌త్యామ్నాయ ఆదాయ వ‌న‌రులు పెంచుకోవ‌డానికి ప్ర‌భుత్వం ఆలోచ‌న చేస్తుంది. ఆరు గ్యారంటీల అమ‌లుకు, ఇరిగేష‌న్ ప్రాజెక్టులు, ఖాళీ గా ఉన్న ఉద్యోగాల భ‌ర్తీ గురించి కావాల్సిన నిధుల‌ను స‌మ‌కూరుస్తాము. రాష్ట్రం స‌మ‌గ్రంగా అభివృద్ది చెందాల‌ని కోరుకునే వాళ్లం ఒక ప్రాంతం, ఏరియా అభివృద్ది కావాల‌ని కోరుకునే వాళ్లం కాము. గ‌త ప్ర‌భుత్వం ద‌లితబంధుకు 17,700 రూపాయ‌ల కోట్లు కేటాయించి ఒక్క పైస కూడ విడుద‌ల చేయ‌లేదు.

డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ అభయ‌హ‌స్తం కోసం విధి విధానాల రూప‌క‌ల్ప‌న చేస్తున్నాము. మార్గ ద‌ర్శ‌కాలు పూర్తి కాగానే నిధుల కేటాయింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ బిసి మైనార్టీల అభ్యున్న‌తికి కాంగ్రెస్ ప్ర‌భుత్వం అత్యంత ప్రాధ‌న్య‌త ఇస్తుంది. సామాజిక తెలంగాణ నిర్మాణ‌మే ద్యేయంగా మా ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంది. జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క్రియ‌కు కావాల్సిన నిధులు విడుద‌ల చేస్తాము. కొన్ని రోజుల్లోనే నోటిఫికేష‌న్ ప్ర‌క్రియ మొద‌లవుతుంది. ప్ర‌తి సంవ‌త్స‌రం కూడ జాబ్ క్యాలెండ‌ర్ ను పాటిస్తాము.

మ‌నుషుల పై కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. దీనిని అరిక‌ట్ట‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటాము. వెట‌ర్న‌రీ అధికారుల‌తో యాక్ష‌న్ ప్లాన్ త‌యారు చేయిస్తాము.డ‌బుల్ బెడ్ రూం ఆలాట్ మెంట్ గురించి త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటాము. పేరుకుపోయిన గ‌త బకాయిలను ఆర్ధిక శాఖ‌లో క్లియ‌రెన్స్ చేస్తున్నాము.

పాత బ‌స్తీలో మూడు ఫ్లై ఓవ‌ర్‌ల నిర్మాణం త్వ‌రగా పూర్త‌య్యే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటాము. రాష్ట్రానికి ధ‌ర‌ణి గుది బండ‌గా మారింది. దీనిని స‌రిచేయాల్సిన అవ‌స‌రం ఉంది. రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేసింది. ప్ర‌క్షాళ‌న చేసి స‌రి చేయ‌డానికి క‌మిటి వేశాము. క‌మిటి నుంచి నివేదిక వ‌చ్చిన త‌రువాత చ‌ర్య‌లు తీసుకుంటాము.

ధ‌నిక రాష్ట్రంలో 10 సంవ‌త్స‌రాలుగా ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టామ‌ని గొప్ప‌లు చెప్పుకున్నారు. మ‌రీ 2018 నుంచి విద్యార్థుల ఫీజు రియంబ‌ర్స్ మెంట్ క్లియ‌ర్ చేయ‌క‌పోవ‌డం దారుణం. రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల‌కు భ‌వ‌నాల నిర్మాణం కోసం నిధులు కేటాయించం. అందరు తెలంగాణ బిడ్డ‌లే. మాకు ఏలాంటి ప‌క్ష‌పాతం లేదు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలను స‌మానంగానే చూస్తాము.

కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ఫెడ‌ర్ స్పూర్తి ఉంది. త‌ప్ప‌ని స‌రిగా కేంద్రం నుంచి నిధులు తీసుకురావ‌డానికి కృషి చేస్తాము. బాగా ప‌న్నులు చెల్లించే రాష్ట్రాలకు దానికి అనుగుణంగానే కేంద్రం నిధులు కేటాయించాలి. హైద‌రాబాద్ లో క‌బ్జాకు గురైన భూముల‌ను త‌ప్ప‌నిస‌రిగా కాపాడుతాము. పేద‌వాడికి ల‌బ్ధి, న్యాయం జ‌రిగే విధంగా ప‌ని చేయ‌డమే మా కాంగ్రెస్ ప్ర‌భుత్వం ల‌క్ష్యం.

స‌మిష్టిగా ప‌ని చేసి ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేద్దామ‌ని పెద్ద‌లు సాంబ‌శివ‌రావు రావు కి విన్న‌విస్తున్నాను. జీవితం మొత్తం కూలీ నాలీ చేసి వృద్దాప్యంలో ఆర్ధిక ఇబ్బందులు ప‌డేటువంటి వారికి ప్ర‌తి నెల ప‌ది, ప‌న్నెండు వేలు ఫించ‌న్ వ‌చ్చే విధంగా గ‌తంలో మ‌హిళ‌ల కోసం అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం పెట్టాము. గ‌త ప్ర‌భుత్వం దానిని ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు సాంబ‌శివ‌రావు గారు చెప్పిన సూచ‌న ప్ర‌కారం తిరిగి ఆలోచ‌న చేస్తాము. ఇది అవ‌స‌రం కూడా. ఒంటేద్దు పోక‌డ‌తో మేము వెళ్లం. మాకు ఏలాంటి భేష జాలాలు లేవు. ప్ర‌తి ప‌క్షాల అభిప్రాయాలు, సూచ‌న‌లను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటాము. అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ ను బ్రాడ్ గా ఆమోదించాల‌ని కోరుతున్నాను.

రాష్ట్రంలో ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌లేని దుస్తితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన గ‌త ప్ర‌భుత్వం

జీఎస్ డిపికి అనుగుణంగానే 60వేల కోట్ల రూపాయ‌లు బ‌డ్జెట్‌లో చూపించాము.

రాష్ట్రం తెచ్చుకున్న‌దే ఉద్యోగాల కోసం. 10 సంవ‌త్స‌రాలు అధికారంలో ఉండి గ్రూప్ -1 వేయ‌లేక‌పోయారు. ఎంత మంది త‌ల్లులు క‌న్నీళ్లు పెట్టుకున్నారో మీకు తెలియ‌దు. టీఎస్‌పీఎస్సీ ప్ర‌క్షాళ‌న చేశాం. ఉద్యోగాల నోటిఫికేష‌న్ కోసం 40 కోట్ల రూపాయ‌లు ఇచ్చాము. 563 గ్రూప్-1 ఉద్యోగాల కోసం నోటిఫికేష‌న్ వేయ‌బోతున్నాము.

ఎల్ బి స్టేడీయంలో 7వేల మంది స్టాఫ్ న‌ర్సుల‌కు నియామ‌క ప‌త్రాలు ఇచ్చాము. సింగ‌రేణిలో 441 మందికి అంబేద్క‌ర్ విగ్రహం సాక్షిగా నియామ‌క ప‌త్రాలు ఇచ్చాము. రాష్ట్రంలో ఉద్యోగాల జాత‌ర మొద‌లు పెట్టాము. ఇది ఆరంభం మాత్ర‌మే ఈ రోజు మ‌రో గంట సేప‌ట్లో 2 వేల మందికి రెసిడెన్షియ‌ల్స్‌లో ఉద్యోగాల నియామ‌క ప‌త్రాలు ఇవ్వ‌బోతున్నాము. 13444 మందికి కానిస్టేబుల్స్‌కు నియామ‌క ప‌త్రాలు ఎల్ బి స్టేడియంలో ఇచ్చాము. ఆరు గ్యారంటీల హామీల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాము. గాలికి వ‌దిలేయ‌లేదు.