ఉండవల్లి : రాయలసీమకు చెందిన వివిధ విద్యార్థి సంఘాల నేతలు టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో బుధవారం రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఛైర్మన్ బి.శ్రీనివాసులు, వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి బి.నాగరాజు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి చంద్రబాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం జేఏసీ నేతలు మాట్లాడుతూ….జాబ్ కేలండర్ పేరుతో వైసీపీ యువతను మోసం చేసిందని, ఈ ప్రభుత్వంలో యువతకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీకి యువత బుద్ధి చెప్తుందన్నారు.
పార్టీలో చేరిన వారిలో సి.రాజు(రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ కో కన్వీనర్), కె.చంద్రశేఖర్(రాయలసీమ యూనివర్సిటీ జేఏసీ కన్వీనర్), జి.లక్ష్మణ్(రాయలసీమ యూనివర్సిటీ జేఏసీ కో కన్వీనర్), పి.వెంకటేష్(ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు), బి.నవీన్ కుమార్(రాయలసీమ విద్యార్థి జేఏసీ), సి.ఏసేపు(ఏపీ నిరుద్యోగుల వేదిక కర్నూలు జిల్లా అధ్యక్షులు), మహబూబ్ బాషా(మైనారిటీ హక్కుల పోరాట సమితి), కె.శ్రీనివాసులు, కె.నవీన్(రాయలసీమ పరిరక్షణ సమితి స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు), బి.మధు(ఏపీ నిరుద్యోగుల వేదిక నాయకలు) తదితరులు చేరారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు కో-ఆర్డినేటర్ గౌరు వెంకటరెడ్డి పాల్గొన్నారు.