కాకినాడ జిల్లా జగ్గంపేట, మహానాడు: జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్బవ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు, జగ్గంపేట టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. రాబోయే ఎన్నికల్లో కూటమికి బాసటగా నిలబడాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, దాపర్తి సీతారామయ్య, సత్తి సదాశివరెడ్డి, అడబాల భాస్కరరావు, పిలా మహేష్, నండ్ల చిరంజీవి, నేదూరి గణేష్, అరటా పోలీస్, కొండ్రోతు శ్రీను, తవటం వీరభద్రరావు, వెలిశెట్టిబుజ్జి కుంచే తాతాజీ, ముర సత్తిబాబు, ఎండి కాజా, హరి గోపాల్, తదితరులు పాల్గొన్నారు.