-చంద్రబాబుని ముఖ్యమంత్రిగా గెలిపించుకుందాం
-విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్
-జగ్గయ్యపేట అభ్యర్థి నామినేషన్‌కు హాజరు
-భారీ ర్యాలీకి తరలివచ్చిన కూటమి శ్రేణులు
-విజయోత్సవాన్ని తలపించిన కార్యక్రమం
-పాల్గొన్న పార్లమెంటు అధ్యక్షుడు నెట్టెం రఘురాం
జగ్గయ్యపేట: ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటివరకు జరిగిన కూటమి అభ్యర్థుల నామినేషన్ల పర్వం వైసీపీ నాయకుల గుండెల్లో వణుకు పుట్టిస్తే జగ్గయ్యపేటలో శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నామినేషన్ ర్యాలీతో తాడేపల్లి ప్యాలెస్‌లోని నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని టీడీపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ అన్నారు.
జగ్గయ్యపేట నియోజక వర్గ కూటమి అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నామినేషన్ గురువారం జరిగింది. భారీ ర్యాలీగా పట్టణ పురవీధుల్లో వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తల మధ్య ర్యాలీ సాగింది. శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఇంటిదగ్గర ప్రారంభమైన ర్యాలీ ఎన్టీఆర్ సర్కిల్‌కి చేరుకోవడానికి దాదాపు 3 గంటల సమయం పట్టింది. ముక్త్యాల రోడ్, కన్యాకుమారి పాన్ షాప్ సెంట ర్ మొత్తం జనంతో కిక్కిరిసిపోయింది. కులాలు, మతాలకు అతీతంగా ముస్లిం మైనారిటీ మహిళలు కూడా ఈ ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపారు. ప్రచార రథంపై రాజగోపాల్ తాతయ్యతో పాటు శివనాథ్, ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు నెట్టెం రఘురాం ఉండగా, ప్రచార రథానికి ముందు రాజగోపాల్ తాతయ్య భార్య వాణి (అమ్మాజీ) మహిళా కార్యకర్తల తో నడుస్తూ ఉత్సాహం నింపారు. ఎన్టీఆర్ సెంటర్లో ప్రజలను ఉద్దేశించి కేశినేని శివనాథ్ మాట్లాడారు.
రాష్ట్రానికి పట్టిన పీడను వదిలించుకుందామని పిలుపునిచ్చారు. ఈ నామినేష న్ ర్యాలీ విజయోత్సవ ర్యాలీని తలపిస్తుందన్నారు. కూటమి విజయాన్ని ఎవరూ ఆపలేర న్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఏడు నియోజకవర్గాలలో ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించి చంద్రబాబు కానుకగా అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తామంతా జిల్లా అధ్యక్షుడు నిత్యం రఘురాం అడుగుజాడల్లో నడిచి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. శ్రీరాం రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ జగ్గయ్యపేటలో తాగునీరు, సాగునీరు పరిష్కరించడంతో పాటు, టిడ్కో ఇళ్లు 80 శాతం చంద్రబాబు పూర్తి చేశామని, 20 శాతం పనులు వైసీపీ గత ఐదేళ్లుగా చేయలేకపోయిందన్నారు. ఆ పనులు కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజే స్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.