ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం

-వ్యవస్థలను భ్రష్టు పట్టించిన వైసీపీని తరిమికొట్టాలి
-టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌

పెనమలూరు, మహానాడు: పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు టౌన్‌ పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన తెదేపా, జనసేన, బీజేపీ నాయకుల, కార్యకర్తల సమావేశానికి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. మన బిడ్డలకు భవిష్యత్తు ఉండాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, ఈ జగన్మోహన్‌ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు, వ్యవస్థలు అణిచివేతకు గురయ్యారన్నారు. కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్‌, మచిలీపట్నం పార్లమెంట్‌ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిని గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తెదేపా సగర సాధికార రాష్ట్ర అధ్యక్షుడు జంపన వీర శ్రీనివాస్‌, నగర పంచాయతీ మాజీ చైర్మన్‌లు జంపాన పూర్ణచంద్రరావు, అబ్దుల్‌ కుదూస్‌, టౌన్‌ పార్టీ అధ్యక్షుడు జంపాన గురునాధరావు, క్లస్టర్‌ ఇన్‌చార్జి కూనపరెడ్డి వాసు, మైనార్టీ సెల్‌ కార్య దర్శి సయ్యద్‌ అజ్మతుల్లా, బీసీ సెల్‌ కార్యదర్శి రాజులపాటి ఫణి, నగర పంచాయతీ కౌన్సిల ర్లు పలియాల శ్రీనివాసరావు, మాజీ కోఆప్షన్‌ సభ్యులు రఫీ, నజీర్‌, జిల్లా అధికార ప్రతినిధి కొండా ప్రవీణ్‌, బూరెల నరేష్‌, జనసేన మండల పార్టీ అధ్యక్షుడు జరుగు ఆదినారాయణ, జనసేన నాయకులు బొప్పన ప్రసాదు, జనసేన వీరమహిళలు, మైనార్టీ నాయకులు, బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు పాల్గొన్నారు.