-సూపర్ 6 పథకాలతో కొండంత భరోసా
-దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్
-ప్రచారంలో రైతుకూలీలతో మాటామంతీ
దెందులూరు, మహానాడు: పేదవర్గాల సంక్షేమమే చంద్రన్న ఆశయం, బాబు సూపర్ 6 పథకాలతో ప్రతి పేద కుటుంబానికి కొండంత భరోసా అని దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం దెందులూరు నియోజకవర్గంలో ఉద యం నుంచే ఆయన గ్రామాల్లో పర్యటించారు. ఉదయం పెదవేగి మండలం రామసింగ వరం, కూచింపూడి, న్యాయంపల్లి గ్రామాల్లో ప్రచారం కొనసాగింది. గ్రామ గ్రామాన చింతమనేనికి ఘనస్వాగతం లభించింది. పొలం పనులు చేస్తున్న రైతు కూలీలతో చింతమ నేని ప్రభాకర్ మాట్లాడారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలు చింతమనేనికి చెప్పి వాపోయారు. వైసీపీ పాలనలో అభివృద్ధి నిలిచిపోయిందని, పరిపాలన చేతకాని జగన్ వల్ల రాష్ట్రం సర్వ నాశనం అయిందన్నారు. దాని ఫలితంగా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ లక్షలాది మంది పేదల కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయని తెలిపారు. మీ బిడ్డలకు మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలు రావాలంటే టీడీపీ కూటమి అధికారంలోకి రావాలని, సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు.