చెల్లి దుస్తులపై వ్యాఖ్యలు సిగ్గుచేటు
తండ్రిని చంపారన్న రిలయన్స్ కుటుంబానికి రాజ్యసభ ఇవ్వలేదా?
స్వలాభం కోసం వైఎస్ పేరును సీబీఐ కేసులో చేర్చలేదా?
అవినాష్‌ను వెనకేసుకు రావడం విడ్డూరం
జగన్ వ్యాఖ్యలపై బీటెక్ రవి రియాక్షన్
పులివెందుల, మహానాడు : పులివెందులలో జగన్ వ్యాఖ్యలపై శుక్రవారం విలేఖరుల సమావేశంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి స్పందించారు. పేదవాడికి పెతందారుడికి పోటీ అన్న జగన్ అఫిడవిట్‌లో రూ.750 కోట్లు చూపించాడు…నా ఆస్తులు రూ.70 లక్షలు..ఎవరు పెత్తందారులని ప్రశ్నిం చారు. చెల్లెలిపై వ్యక్తిగతంగా వారు వేసుకున్న దుస్తులపై కూడా మాట్లాడం సిగ్గుచేటు.. పసుపు దుస్తులు భారతి వేసుకోవడం లేదా అని ప్రశ్నించారు. తండ్రిని చంపారు అన్న రిలయన్స్ కుటుంబానికి రాజ్యసభ ఇవ్వలేదా? తన స్వలాభం కోసం తండ్రి పేరు సీబీఐ కేసులో వేయించలేదా? సమాధానం చెప్పాలని కోరారు. సభ్యత, సంస్కారం ఉంది కాబట్టే వివేకా వ్యక్తిగత జీవితంపై మాట్లాడటం లేదని, జగన్ నామినేషన్ సభ అట్టర్ ఫ్లాప్ అయింద న్నారు. సీబీఐ కేసులో ఉన్న అవినాష్ రెడ్డిని జగన్ వెనుకేసుకుని రావటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.