ధర్మవరంలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌ ప్రచారం

ధర్మవరం, మహానాడు : ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం రామాపురంలో శనివారం బీజేపీ అభ్యర్థి వై.సత్యకుమార్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనతో పాటు బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్‌, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్‌ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌కు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించా రు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.