బిడ్డ బెయిల్‌ కోసం బీజేపీకి రిజర్వేషన్ల తాకట్టు…

మోదీ కుట్రపై కేసీఆర్‌ విధానం ఏంటో చెప్పాలి
చీకటి ఒప్పందం లేకుంటే మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలి
ఈటెలకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడటం లేదు
కేసీఆర్‌ను బండకేసి కొట్టినా బలుపు తగ్గలేదు…
కేటీఆర్‌ పిల్లాడు..విమర్శలకు స్పందించను
ఫోన్‌ ట్యాపింగ్‌పై నివేదిక వచ్చే వరకు స్పందించను
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

హైదరాబాద్‌, మహానాడు : రిజర్వేషన్ల రద్దు కుట్ర జరుగుతుంటే కేసీఆర్‌ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ అని తెలిపారు. ఈ దేశ బీసీ, ఓబీసీలపై మోదీ సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తున్నారు. బీసీ జనాభా లెక్కించడం చారిత్రాత్మక అవసరం. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఆరెస్సెస్‌ అనేక కార్యక్రమాలు చేసింది. రిజర్వేషన్ల రద్దు కుట్ర జరుగుతుంటే కేసీఆర్‌ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు…బిడ్డ బెయిల్‌ కోసమే కేసీఆర్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను తాకట్టు పెట్టాడని విమర్శించారు. రిజర్వేషన్లపై ఆయన విధానం ఏమిటో చెప్పా లని కోరారు. అక్రమంగా అయినా అధికారంలోకి రావాలని మోదీ అనుకుంటున్నాడు. కాంగ్రెస్‌ ప్రశ్నలకు మోదీ, అమిత్‌ షా, నడ్డా దగ్గర సమాధానం లేదు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని ఓబీసీలు విజ్ఞప్తి చేశారు.

అధికారంలోకి రాగానే బీసీ జనా భాను లెక్కిస్తాం..జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని వెల్లడిరచారు. 2025 లోపు రాజ్యాంగాన్ని మార్చాలని ఆరెస్సెస్‌ టార్గెట్‌గా పెట్టుకుంది. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు తీసేయాలని బీజేపీ భావిస్తోంది. ఆరెస్సెస్‌ మనువాద సిద్దాంతాన్ని కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తుంది. బీజేపీ అమలు చేస్తోంది. రిజర్వేషన్ల రద్దుకు కుట్ర జరుగుతుంటే ఈటెల రాజేందర్‌ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఈటెలకు భూముల అమ్మ కం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. చీకటి ఒప్పందం లేకుంటే మల్లారెడ్డి బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం మాట్లాడుతుంటే ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

పెద్దమ్మ తల్లిపై ఒట్టు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా

పెద్దమ్మ తల్లిపై ఒట్టు వేసి చెబుతున్నా. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతా. కేటీఆర్‌ చిన్న పిల్లాడు. కేసీఆర్‌ ఏమైనా విమర్శలు చేస్తే స్పందిస్తా. కేసీఆర్‌ను బండకేసి కొట్టినా బలుపు తగ్గలేదన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ విచారణ జరుగుతోంది. నివేదిక పూర్తిగా వచ్చే వరకు నేనేం స్పందించను. మోదీని మెప్పించే ప్రయత్నం కేసీఆర్‌ చేస్తున్నాడని విమర్శించారు. రుణ మాఫీ ఎలా చేయాలో స్ట్రాటజీ నా దగ్గర ఉంది. ఆర్థిక విధ్వంసం జరిగినప్పుడు ఈటెలనే అర్థిక మంత్రి..రైతులు చావాలని కేసీఆర్‌, ఈటెల కోరుకుంటున్నారని మండిపడ్డారు.