నామినేషన్ ఉపసంహరణకు అంగీకారం
నూజివీడు: నూజివీడు టీడీపీ రెబల్‌గా నామినేషన్ వేసిన ముద్రబోయిన వెంకటేశ్వరరావు వెనక్కి తగ్గారు. ఆదివారం ఆయన తిరిగి టీడీపీలో చేరనున్నట్టు విశ్వసనీయ సమాచారం. పదేళ్లుగా నూజివీడు టీడీపీ ఇన్చార్జిగా ఉన్న ముద్రబోయిన స్థానంలో అదే సామాజిక వర్గాని కి చెందిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథికి అధిష్ఠానం నూజివీడు టికెట్ కేటాయించింది. దీంతో అలకబూనిన ముద్రబోయిన టీడీపీకి రాజీనామా చేశారు. రెబల్‌గా నామినేషన్ వేశా రు. అయితే నాయకుల చర్చల అనంతరం నామినేషన్ ఉపసంహరించుకుని తిరిగి టీడీపీలో చేరడానికి అంగీకరించినట్లు తెలిసింది.