అభివృద్ధి కోసం కూటమి గెలుపు అవసరం
సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి, మహానాడు : నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలో శనివారం కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైకాపా పాలనలో మాఫియా రాజ్యమేలుతుందని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలు దగా పడ్డాయని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని, అవి పూర్తి చేయాలంటే కూటమి రావలసిన అవసరం ఉందన్నారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.