బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు
విజయవాడ, మహానాడు : కేంద్ర నిధులతో మరో జిమ్మిక్కులా వైసీపీ మేనిఫెస్టో ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు వ్యాఖ్యానించారు. ఆదివారం వైసీపీ విడుదల చేసిన మేనిపె ˜స్టోపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత సీసాలో పాత సారా లాగా వైసీపీ మేనిఫెస్టో ఉందని, మేనిఫెస్టో ఒక జిమ్మిక్కుగా అభివర్ణించారు. కేంద్ర నిధులతో పార్టీ మేనిఫెస్టో ఎలా రూపొందిస్తారని ప్రశ్నిం చారు. 2019 హామీలు తీర్చ కుండా పాత పాటే పాడినట్లుంది. కేంద్ర పథకాల పేర్లు మార్చి తమవిగా చెప్పుకున్నారు.
ప్రధానమంత్రి స్వానిధి పథకానికి పేరు మార్చుకుని మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. వైద్య రంగానికి కేంద్రం ఇచ్చే పథకం పేరు మార్చుకున్నారు. కేంద్రం ఇచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టిస్తున్నారు. బీజేపీ కేంద్రంలో ఏం చెప్పిందో అవన్నీ 100 శాతం మోదీ నేతృత్వంలో చేసి చూపించామని, కేంద్రంలో చేసినవన్నీ రాష్ట్రం లో జరుగుతాయన్నారు. ఈ సమావేశంలో మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజి, టూర్స్ ఇన్చార్జ్ కిలారు దిలీప్, యశ్వంత్, మల్లిఖార్జునమూర్తి, శశికుమార్ తదితరులు పాల్గొన్నారు.