మీకు, మీ మేనిఫెస్టోకు విలువ లేదు..

2019లో మాట నిలబెట్టుకోలేదు..
ఇప్పుడు ప్రజలు ఎందుకు నమ్మాలి?
పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి

విశాఖపట్నం, మహానాడు : మీకు.. మీ మాటకు విలువ లేదు..మీ మేనిఫెస్టోకు విలువ లేదంటూ వైసీపీపై పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం జగన్‌ విడుదల చేసిన మేనిఫెస్టోపై ఆమె స్పందించారు. 2019లో ఇచ్చిన హామీలపై మాట నిలబెట్టుకోలేదు..ఇప్పుడు మళ్లీ కొత్త మేనిఫెస్టో అంటే ఎవరు నమ్ముతారు? మేనిఫెస్టోను బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీత అని ప్రమాణం చేసిన మీరు అందులో చెప్పిన ఒక్క అంశం నెరవేర్చలేదు. ప్రజలు మీ హామీలను ఎందుకు నమ్మాలి? అని షర్మిల నిలదీశారు. కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా తెస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు అని ప్రశ్నించారు.