కాంగ్రెస్‌ మోసాలను ప్రజలు గ్రహించారు

పార్లమెంటు ఎన్నికల్లో బుద్ధి చెబుతారు
బీఆర్‌ఎస్‌ నేత పట్టోళ్ల కార్తీక్‌రెడ్డి

హైదరాబాద్‌, మహానాడు : బీఆర్‌ఎస్‌ నేత పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో రాజకీయం పూర్తిగా మారిపోయిందని, ఏ ప్రభుత్వానికి రాని వ్యతిరేకత కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ మోసాలను తెలంగాణ ప్రజలు గ్రహించారని, ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్క దానిని సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు. సాగు, తాగునీరు, కరెంటు కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్‌ పాలనకు, రేవంత్‌ రెడ్డి పాలనకు తేడాను ప్రజలు గమనించారు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టాలని మంత్రి అంటున్నారు. వారి అహంకారాన్ని ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అధికారం తలకెక్కిందా అని ప్రముఖ జాతీయ జర్నలిస్ట్‌ బర్కాదత్‌ ట్వీట్‌ చేశారు. సీఎం సెక్యూరిటీ సిబ్బంది తనను ఎలా నెట్టి వేసింది కూడా ఆమె చెప్పారు. ఇంత తక్కువ వ్యవధిలోనే ఎంత మార్పు అని ఆమె పోస్టు పెట్టారు. కాంగ్రెస్‌ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్‌ నేతల అహం కారం తగ్గాలంటే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడిరచాలి. లేకుంటే రేవంత్‌ సీఎం కుర్చీ నుంచి దిగిపోయేది లేదు. ఆ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ప్రజలను పట్టించుకోరు. తెలంగాణలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా అగ్ని గోళంలా ఉందన్నారు. ఎండలు పెరిగినట్టే కాంగ్రెస్‌ మీద వ్యతి రేకత పెరుగుతోందని, బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు.