ఆర్యవైశ్య సంఘం ముఖ్యనేతల సమావేశం

పాల్గొన్న హిందూపురం, మడకశిర టీడీపీ అభ్యర్థులు

మడకశిర, మహానాడు : మడకశిర పట్టణం వాసవీ మహల్‌లో ఆదివారం ఆర్యవైశ్యుల సంఘం ముఖ్యనేతల సమావేశం జరిగింది. హిందూపురం పార్లమెంట్‌ ఉమ్మడి అభ్యర్థి బి.కె.పార్థసారథి, మడకశిర నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గుండుమల తిప్పేస్వామి, మడకశిర నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.ఎస్‌.రాజు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గోపాలకృష్ణ, ఆర్యవైశ్య సంఘం నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.