గ్రామాల్లో సమస్యలు పరిష్కరిస్తాం

టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి

రాజమండ్రి, మహానాడు : రాజమహేంద్రవరం రూరల్‌ కడియం మండలం జెగురుపాడు టీడీపీ గ్రామ కమిటీ నాయకు లు మర్రిడి రమేష్‌, పాతురి రాజేష్‌ ఆధ్వర్యంలో ఆదివారం మీ ఇంటికి మీ గోరంట్ల కార్యక్ర మం నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే అభ్యర్థి గోరం ట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. అనంతరం పలువురు వైసీపీ నాయకులు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం గోరంట, అయన కుమార్తె కంఠంనేని శిరీష, టీడీపీ సీనియర్‌ నాయకులు గారపాటి అమర్నాథ్‌తో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ముఖ్యంగా డ్రైనేజీ సమస్య ఉందన్నారు. గ్రామాల్లో మురుగు నీరు పోయే విధంగా మెరుగు పరచాల్సిన అవసరం ఉందన్నారు.

జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కూటమి అధికా రంలోకి వచ్చిన వెంటనే పాలెంలో 15 వేల ఇళ్ల నిర్మాణం చేసి ఇస్తామన్నారు. ఈ కార్యక్ర మంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, కడియం మండల ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్‌, మార్గని సత్యనారాయణ, ప్రత్తిపాటి రామారావు చౌదరి, జనసేన నాయకులు నాగిరెడ్డి రామకృష్ణ, కర్రీ చిన్నబాబు, వనమాలి బాలాజీ వల్లూరి మోహన్‌రావు, కొమ్మరవత్తుల సూర్య కుమార్‌, గెడ్డం శివ, చండూరి సత్యనారాయణ, బీజేపీ నాయకులు ఆకులు శ్రీధర్‌, నాగులా పల్లి వీరబాబు, చిక్కాల శ్రీనివాస్‌, రామచంద్రరావు, గారపాటి తాతబ్బాయి, వాసాల సత్తిబాబు పాల్గొన్నారు.