అబద్ధాల ప్రొఫెసర్‌ కేసీఆర్‌…

-పొలిటికల్‌ పవర్‌ లేనందుకే ఆయన బాధ
-పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి

హైదరాబాద్‌, మహానాడు: గాంధీ భవన్‌లో పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. అబద్ధాల ప్రొఫెసర్‌ కేసీఆర్‌.. కల్వకుంట్ల పేరు తీసేసి అబద్ధాల కేసీఆర్‌ అని పెట్టాలని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ బాధ కరెంట్‌ గురించి కాదు..పొలిటికల్‌ పవర్‌ లేనందు కని చురక అంటించారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ నివాసంలో కేసీఆర్‌ భోజనం చేసేటప్పుడు మూడు సార్లు కరెంట్‌ పోయింది అంటే ఎవరు నమ్మరు. రాష్ట్రం ఎప్పుడు విడిపోతే అప్పుడు సీఎం కావాలి అనుకునేవాడు కేసీఆర్‌. తెలంగాణ విభజన తరువాత ప్రజలు ఎట్లా జీవిస్తున్నారని ఎప్పుడైనా కేసీఆర్‌ అడిగారా. సీఎంగా ఉన్నపుడు ప్రజలు గుర్తులేరు.. ప్రతిపక్షంలోకి వచ్చాక ప్రజలు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబానికి ప్రజలు పొలిటికల్‌ పవర్‌ కట్‌ చేశారు. గత్యంతరం లేక పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. పది సంవత్సరాల పాలనలో కెసిఆర్‌ ఎప్పుడైనా సెక్రటేరియట్‌లో ప్రజలకి అందుబాటులో ఉన్నారా? పదేళ్లు సీఎంగా ఉన్నపుడు ట్విట్టర్‌ లేదు .. ప్రతిపక్షంలోకి వచ్చాక ట్విట్టర్‌ వచ్చిందా అని ప్రశ్నించారు