జగన్‌ రూపాయి పావలా మేనిఫెస్టో అది

ప్రజలు నమ్మే స్థితిలో లేరు
రాష్ట్రంలో కూటమి విజయం ఖాయం
జనసేన నాయకురాలు రాయపాటి అరుణ

విజయవాడ, మహానాడు : జగన్‌ ఎన్నికల మేనిఫెస్టోపై జనసేన నాయకురాలు రాయపాటి అరుణ సోమవారం స్పందిం చారు. జగన్‌ ప్రకటించిన మేనిఫెస్టో చూసుకుంటే రూపాయిని రూపాయి పావలా చేసి చూపిం చారని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయని జగన్‌ మేనిఫెస్టోను ఇప్పుడు ఎందుకు నమ్ముతారని ప్రశ్నించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న విడుదల రజనీ నియో జకవర్గంలో సరైన రోడ్లు లేక, సరైన ప్రభుత్వ ఆసుపత్రి లేక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. ప్రశ్నిస్తున్న వారిని హేళన చేశారు. రాష్ట్ర పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు లేదు. ఫీజు రీయిం బర్స్‌మెంట్‌ పేరుతో తల్లితండ్రుల ఖాతాలకు డబ్బు పంపిస్తామని చెప్పి విడుదల చేయటంలో జాప్యం చేశారు.

దీంతో ఫీజులు కట్టలేక పరీక్షలు రాయలేకపోయారు. విద్యార్థు లు ఆత్మహత్యలు చేసుకున్నారు. పోలవరం గురించి అసెంబ్లీలో పూర్తి చేస్తామని చెప్పి ఐదు శాతం కూడా పూర్తి చేయలేకపోయారు. కార్పొరేషన్‌ నిధులు దోచేసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల నిధులు ఎవరి జేబులోకి వెళ్లాయి. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారని అడిగితే చెప్పలేని పరిస్థితిలో జగన్‌ ప్రభుత్వం ఉంది. ఈ ఎన్నికల్లో జగన్‌ను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కూటమి అధికారంలోకి రాబోతుందని, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లనుందని తెలిపారు.