పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వ నిర్ణయం దుర్మార్గం

లబ్ధిదారులను బ్యాంకుల చుట్టూ తిప్పేందుకు కుట్ర
సీఎం, సీఎస్‌, సెర్ఫ్‌ సీఈఓ, సెర్ఫ్‌ ఎండీ పన్నాగం
33 మంది వృద్ధులను పొట్టనబెట్టుకుని శవ రాజకీయాలు
ఈసారి వారికేమైనా అయితే జగన్‌ బాధ్యత వహించాలి
ప్రతిపక్ష నేతలపై దాడులు జరుగుతున్న చోద్యం చూస్తున్నారు
రాప్తాడులో దళిత, బీసీలపై దాడులు హేయం
తేదేపా నాయకులు వర్ల రామయ్య, దేవినేని ఉమ ధ్వజం
తక్షణ చర్యలకు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు

అమరావతి, మహానాడు : పెన్షన్‌ పంపిణీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దుర్మార్గమంటూ ఎన్నికల కమిషన్‌కు తెలుగుదేశం పార్టీ నాయకులు వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం మంగళగిరి పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమా వేశంలో మాట్లాడారు. జగన్‌రెడ్డికి రాజకీయ లబ్ధిచేకూర్చాలని సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆరాటపడు తున్నారని తెలిపారు. పెన్షన్‌ సొమ్మును బ్యాంకులో వేసి మండుటెండల్లో వారిని బ్యాంకుల చుట్టూ తిప్పాలని సీఎం, సీఎస్‌, సెర్ఫ్‌ సీఈఓ, సెర్ఫ్‌ ఎండీ కుట్రపన్నారని ఫిర్యాదులో పేర్కొ న్నారు.

గత నెల శవ రాజకీయాలు చేయడం కోసం 33 మంది వృద్ధులను జగన్‌ రెడ్డి ప్రభు త్వం పొట్టన పెట్టుకుందని, ఈసారి ఒక్క వ్యక్తి మరణించినా, దానికి పూర్తి బాధ్యత జగన్‌ మోహన్‌రెడ్డి వహించాలని కోరారు. ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్‌ పంపిణీ చేసే అవకాశమున్నా పెన్షన్‌దారులను ఇబ్బందులు పెట్టాలనే దురుద్దేశంతోనే బ్యాంకుల్లో పెన్షన్‌ను జమ వేస్తామ నడం దుర్మార్గమని, జగన్‌ రెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకే సీఎస్‌ జవహర్‌ రెడ్డి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్‌కుమార్‌ మీనాకు ఫిర్యా దు చేసినట్లు వివరించారు. నాలుగు ఎన్డీఏ ప్రచారా వాహనాలు ధ్వంసం, రాప్తాడు నియోజ కవర్గంలో ఇద్దరు దళిత నాయకులు, ఒక బీసీ నాయకుడిపై వైసీపీ నాయకుల దాడిపై కూడా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై, ప్రచార వాహ నాలపై ఎన్ని దాడులు జరుగుతున్నా రిటర్నింగ్‌ అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు.

జగన్‌కు లబ్ధి కోసమే జవహర్‌ రెడ్డి పనిచేస్తున్నారు : వర్ల రామయ్య

పెన్షన్‌దారుల ప్రాణాలు తీయడానికి సీఎస్‌ జవహర్‌ రెడ్డి కుట్ర పన్నారు. దుర్మార్గపు ప్రభుత్వం వల్ల పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు వృద్ధుల జీవితాలు పడ్డాయి. 65 లక్షల పెన్షన్‌ దారులకు 49 లక్షల మందికి బ్యాంకుల్లో పెన్షన్‌ జమ వేస్తామనడం దుర్మార్గం. ఎంతమంది ప్రాణాలు పోయినా మేము పట్టిన పట్టు వీడమన్నట్లు పెన్షన్‌లు ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయాలని మేము ఎన్నిసార్లు కోరినా జగన్‌రెడ్డికి రాజకీయ ఎన్నికల లబ్ధి చేకూర్చాలనే దుర్మా ర్గపు ఆలోచనతో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసులే…

పోలింగ్‌ తదీ సమీపిస్తున్నా కూడా ఇంకా రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీ సులు వైఫల్యం చెందుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ లోకి రావాలని ఇద్దరు దళిత యువకులను చావగొట్టి స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఇంటికి తీసుకు వెళ్లి చిత్రహింసలు పెట్టారు. ఇదేమిటని ప్రశ్నించిన ఓ బీసీ నాయకుడిపై ఇష్టానుసారంగా దాడి చేశారు. న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసులు ఎమ్మెల్యేకు సెల్యూట్‌ చేసి వెళ్లిపోయారు. ఇప్పటికీ నాలుగు ప్రచార రథాలను అధికార పార్టీ మూకలు తగలబెట్టారు. దేనిపై కూడా పోలీసులు పట్టించుకోవడం లేదు. వైసీపీ నాయకులకు చట్టాలు వర్తించడం లేదని ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.

మహారాష్ట్ర ఎన్నికల విధుల్లో ఉన్న వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ కల్పించాలి…

వెయ్యి మంది స్పెషల్‌ పోలీసు అధికారులు మహారాష్ట్రలో ఎన్నికల విధులకు వెళ్లారు. మన రాష్ట్రంలో మే 13న జరగబోయే ఎన్నికల్లో వారు ఓటు హక్కు వినియోగించుకోలేరు. కాబట్టి వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ కల్పించాలి. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి వ్యక్తి పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలి. మహారాష్ట్రలో ఎన్నికల విధుల్లో ఉన్న వెయ్యి మంది మన రాష్ట్రానికి చెందిన పోలీసు అధికారులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఇవ్వని పక్షంలో మే 13 పోలింగ్‌ రోజున ఇక్కడికి వచ్చి వారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించాలని ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసినట్లు వివరించారు.

ప్రజాక్షేత్రంలో తెల్చుకుందాం రా జగన్‌రెడ్డి…

దొడ్డి దారుల్లో దొంగ బుద్ధులు ప్రదర్శించి అధికారం నిలబెట్టుకోవాలనే పగటి కలలను కనడం మానేసి ధైర్యముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. గులకరాయి తగిలింది, తలకి గాయమైందని ప్లాస్టర్‌ వేసుకుని జనాలను మభ్య పెట్టే ప్రయత్నం చేశారు. కానీ జగన్‌ రెడ్డి మోసాలను రాష్ట్ర ప్రజలు గమనించారు. ఇక చేసేది లేక తలకున్న ప్లాస్టర్‌ను తీసి చూస్తే గాయమైన ఆనవాలు కూడా తలపై లేదని ఎద్దేవా చేశారు.

సీఎం, సీఎస్‌, సెర్ఫ్‌ అధికారులు బాధ్యత వహించాలి : దేవినేని ఉమా

మూడున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగులు అందుబాటులో ఉన్నారు. ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్‌ పంపిణీ చేసే అవకాశాలున్నాయి. కానీ దురుద్దేశపూర్వకంగానే సీఎస్‌ జవహర్‌ రెడ్డి దుర్మార్గపు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీకి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చే విధంగా ఆయన ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. కలెక్టర్‌లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో బ్యాంక్‌ ద్వారా పెన్షన్‌లు ఇవ్వడం కష్టమని, పెన్షన్‌దారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని సెర్ఫ్‌ సీఈఓ, ఎండీ ఇతర అధికారులు మొదట చెప్పినా కూడా 10 రోజుల్లో వారు తమ మాటలను మార్చి బ్యాంకుల ద్వారానే పెన్షన్‌లు పంపిణీ చేస్తున్నామని నిర్ణయం తీసుకున్నారు. పెన్షన్‌ డబ్బులు ఏ బ్యాంకులో పడ్డాయో సచివాలయానికి వెళ్లి తెలుసుకోవాలని ఆదేశాలివ్వడం దుర్మార్గపు ఆలోచన. శవ రాజకీయాల చేయడం కోసం వృద్ధుల జీవితాలతో వైసీపీ ప్రభుత్వం ఆడుకుం టుంది. 33 మంది వృద్ధులను పొట్టన పెట్టుకొని జగన్‌ రెడ్డి ప్రభుత్వం ఆడిన డ్రామాను రాష్ట్ర ప్రజలు గమనించారు. ఈసారి పెన్షన్‌ పంపిణీ వ్యవహారంలో ఏ ఒక్క మరణం సంభవించినా అది సర్కారీ హత్యలే. అందుకు పూర్తి బాధ్యత సీఎం జగన్‌ రెడ్డి, సీఎస్‌ జవహార్‌ రెడ్డి, సెర్ఫ్‌ సీఈవో శశిభూషన్‌, ఎండీ మరళీధర్‌ రెడ్డిలే వహించాలి అని హెచ్చరించారు.

ప్రతిపక్షాలపై దాడులు జరుగుతున్నా రిటర్నింగ్‌, పోలీసు అధికారులు ఏమి చేస్తున్నారు?

ఇద్దరు తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు వైసీపీలో చేరమంటే చేరడం లేదని వారిని కొట్టడమే కాకుండా ఇదేమిటని ప్రశ్నించిన బీసీ నాయకుడిపై కూడా కిరాతంకా దాడి చేశారు. నాలుగు ప్రచార వాహనాలను ధ్వంసం చేశారు. పోలింగ్‌ తేదీ దగ్గరపడుతున్నా కూడా ప్రతిపక్షాలపై ఇన్ని దాడులు జరుగుతున్నా రిటర్నింగ్‌ అధికారులు, పోలీసులు ఏమి చేస్తున్నారో అర్థం కావడం లేదు. వీటన్నిటిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి తెలియజేశాం. మంగళవారం రాష్ట్రానికి రానున్న పోలీసు పరిశీలకుడిని కూడా కలిసి ఫిర్యాదు చేస్తామని వివరించారు. ఎన్నికల కమిషన్‌ను కలిసిన వారిలో శాసనమండలి సభ్యులు వేపాడ చిరంజీవి రావు, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావు తదితరులు ఉన్నారు.