గోదావరి నుంచి పైపులైనుతో తాగునీరు ఇస్తాం

దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌
ఎన్నికల ప్రచారానికి ఉప్పొంగిన ప్రజాభిమానం

దెందులూరు, మహానాడు : దెందులూరు మండలం దోసపాడు, కొవ్వలి గ్రామాల్లో సోమవారం టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌యాదవ్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు వారి సమక్షంలో టీడీపీలో చేరారు. చింతమనేని మాట్లాడుతూ ఇంటి స్థలం కోసం ప్రశ్నిస్తే వైసీపీ నాయకులు దెందులూరులో మహిళలపై దాడులు చేస్తున్నారు. ఇక ఈ అరాచక పాలనకు ముగింపు దగ్గరపడిరదన్నారు.

గోదావరి నుంచి పైపులైన్‌ వేసి ట్యాంకు నిర్మిస్తాం…ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుని గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. బాబు సూపర్‌ 6 పథకాల గురించి వివరించారు. చంద్రన్న బీమా 10 లక్షలు అమలు చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్క కుటుంబానికి పెద్ద కొడుకులా అండగా ఉంటానని, ఎంపీ అభ్యర్థి సహకారంతో అన్ని పనులు చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.