రాష్ట్ర భవిష్యత్ కోసం చంద్రబాబు రావాలి
దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి
దర్శి, మహానాడు : తాళ్లూరు మండలం బొద్దికూరపాడు, వెలుగువారిపాలెం గ్రామాలలో దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మీ ఆస్తులు కాపాడుకోవాలన్నా, మీకు భద్రత కావాలన్నా చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు. జగన్ ల్యాండ్ టైట్లింగ్ చట్టం మన మెడకు ఉచ్చుగా మారుతుందని, కూటమి రాగానే రద్దు చేస్తానని చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. విద్యుత్ చార్జీలు 200 నుంచి వెయ్యి రూపాయల వరకు పెంచి ప్రజల నడ్డి విరిచారని విమర్శించారు. పెట్రోలు, డీజిల్ ధరలు అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉన్నాయన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటాయని, తాళ్లూరు మండలంలో మౌలిక సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వం విఫలమైంద న్నారు. పాడి రైతులు, కూరగాయల రైతుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరు మండల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.