రజకులకు దోబీఘాట్లు, విద్యుత్‌ చార్జీల్లో రాయితీలు

చిలకూరిపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్తిపాటి

చిలకలూరిపేట, మహానాడు : రాష్ట్రంలో తమ ప్రభుత్వం రాగానే రజకుల దోబీఘాట్ల నిర్మాణానికి ప్రోత్సాహం, వారికి విద్యుత్‌ చార్జీల్లో రాయితీలు అందిస్తామని చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరిపేట రజక కమ్యూనిటీ హాలులో గురువారం రజకుల ఆత్మీయ సమావేశం ఆయనతో పాటు ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు తండ్రి, విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ లావు రత్తయ్య ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈసారి కూటమి ప్రభుత్వం రాగానే వారి పెండిరగ్‌ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వృత్తి పనులు చేసుకునే వారికి రూ.2 లక్షల ఆర్థిక సాయం కూటమి ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. కార్యక్ర మంలో రజక సంఘ నాయకులు పాల్గొన్నారు.